News


61 డాలర్ల స్థాయికి క్రూడ్‌

Friday 27th September 2019
Markets_main1569559954.png-28584

    చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత నుంచి రెండు వారాల్లోనే సౌదీ తన చమురు ఉత్పత్తిని పునరుద్ధరించడంతో చమురు ధరలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.37 సమయానికి బ్రెంట్‌క్రూడ్‌ 1 శాతం నష్టపోయి బారెల్‌ 61.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.60 శాతం నష్టపోయి బారెల్‌ 56.07 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘ఊహించని దాని కంటే ముందుగానే సౌదీ తన చమురు కేంద్రాలను పునరుద్ధరించడంతో చమురు మార్కెట్‌లో బుల్స్‌ నిరుత్సాహపడ్డారు’ అని యాక్సి ట్రేడర్‌ ఆసియా పసిఫిక్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. కాగా గత పది వారాల్లో డబ్యూటీఐ క్రూడ్‌ ధర అధికంగా ఈ వారమే నష్టపోయింది. ఈ వారం డబ్యూటీఐ క్రూడ్‌ 3 శాతం పడిపోయింది. అదే విధంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఈ వారం 2.9 శాతం నష్టపోయింది. ఇది గత ఏడు వారాల కంటే అత్యధిక పతనం కావడం గమనార్హం.
  సౌదీ అరేబీయా తన చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత నుంచి రెండు వారాల్లోనే తమ చమురు ఉత్పత్తిని రోజుకు 113 లక్షల బ్యారెల్స్‌ను తిరిగి పునరుద్ధరించిందని రాయిటర్స్‌ నివేదించింది. సౌదీ చమురు కేంద్రాలపై సెప్టెంబర్‌ 14 న డ్రోన్‌ దాడి జరగడంతో చమురు ధరలు 20 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సౌదీ ఈ నెల చివరినాటికి తన పూర్తి చమురు ఉత్పత్తిని పునరుద్ధరిస్తానని ప్రకటించడంతో చమురు ధరలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. దీంతో పాటు గత వారానికి సంబంధించిన యుఎస్‌ చమురు నిల్వలు 24 లక్షల బారెల్స్‌ పెరగడంతో కూడా డిమాండ్‌ ఆందోళనలు చమురు మార్కెట్లో పెరిగాయి. అంతేకాకుండా యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలు అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి.



You may be interested

నష్టాల్లో మారుతి, బజాజ్‌, హీరో మోటో

Friday 27th September 2019

అంతర్జాతీయ మార్కెట్‌లు శుక్రవారం నెగిటివ్‌లో ట్రేడవుతుండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు కూడా అదే బాటాలో నడుస్తున్నాయి. ఉదయం 10.48 సమయానికి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.45 శాతం కోల్పోయి 7,548.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన మారుతి సుజుకీ 1.25 శాతం నష్టపోయి రూ. 6,772.05 వద్ద, బజాజ్‌ ఆటో 1.01 శాతం నష్టపోయి రూ. 2,940.35 వద్ద, ఐషర్‌ మోటర్స్‌ 0.62 శాతం రూ.

పన్ను కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలి

Friday 27th September 2019

ఉత్పత్తుల ధరలను తగ్గించాలి దాంతో అమ్మకాలు పెరుగుతాయి ఆర్థిక గణాంకాలు అనుకూలంగా ఉన్నాయి హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌పరేఖ్‌  న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే తగ్గించిన కార్పొరేట్‌ పన్ను ప్రయోజనాన్ని లాభాల్లో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను తగ్గించడం ద్వారా కస్టమర్లకు బదలాయించాలని ప్రముఖ బ్యాంకర్‌, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ సూచించారు. తద్వారా కంపెనీల ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును తగ్గించడం అన్నది దేశ వృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయం వ్యకర్తం చేశారు. ప్రభుత్వ

Most from this category