News


స్వల్పంగా తగ్గిన చమురు

Monday 15th July 2019
Markets_main1563163067.png-27053

అతి పెద్ద చమురు దిగుమతిదారైన చైనా గత 27 ఏళ్లలో అతి తక్కువ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక జీడీపీ రేటును ప్రకటించనుందనే అంచనాల నేపథ్యంలో ఆయిల్‌ ధరలు స్వల్పం‍గా తగ్గాయి. చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం వలన చైనా జీడిపీ రేటు మందగించింది.  బ్రెంట్‌ క్రూడ్‌ సెప్టెంబర్‌ ప్యూచర్‌ ధర 6 సెంటులు తగ్గి బ్యారెల్‌ 66.66 డాలర్లకు, అమెరికా క్రూడ్‌ అగష్టు ప్యూచర్‌ 5 సెంటులు తగ్గి బ్యారెల్‌ 60.16 డాలర్లకు పడిపోయాయి. చైనా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటును 6.2 శాతంగా ప్రకటించనుందని, ఇది 1992 మొదటి క్వార్టర్‌ నుంచి ఇప్పటి వరకు నమోదైనా  జీడీపీ రేటులలో తక్కువని విశ్లేషకులు తెలిపారు. చైనా ఆర్థిక ఉద్దీపనలను ప్రకటిస్తే చమురు ధరలకు మద్ధతుగా ఉంటుంది కానీ రుణాల స్థాయి అధికంగా ఉండడంతో పాటు వ్యవస్థీకృతంగా ప్రమాదం ఉండడంతో ఉద్దీపనలకు పరిమితులుండవచ్చని వివరించారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో తుఫాను వలన అమెరికా చమురు ఉత్పత్తి 73 శాతం లేదా 1.38 బీపీడీ కోతపడింది. ఫలితంగా ఆయిల్‌ ధరలకు మద్ధతు లబిస్తోంది.
 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 15th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  జెట్‌ ఎయిర్‌వేస్‌:- జూలై 16న క్రిడెట్‌ కమిటి తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. రుణదాతలు ఎన్‌సీఎల్‌టీ ద్వారా రిసెల్యూషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.  అలహదబాద్‌ బ్యాంక్‌:- భూషణ్‌ స్టీల్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ రూ.1175 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకు నివేదికనిచ్చింది. భెల్‌:- ఎన్‌టీసీసీ నుంచి ఈపీసీ విభాగంలో రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. ఈ ఆర్డర్లలో భాగంగా కంపెనీ 25

గ్యాప్‌అప్‌...నిఫ్టీ 11,600పైన ప్రారంభం

Monday 15th July 2019

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రికార్డు 5 శాతం లాభంతో ప్రారంభంకావడంతో సోమవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 278 పాయింట్ల లాభంతో 39,015 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,615 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్‌ వెల్లడించిన ఫలితాలతో పాటు ఆదాయం గైడెన్స్‌ పెంచిన ప్రభావంతో ఆ షేరు తాజాగా 5 శాతం లాభంతో రూ.763

Most from this category