News


నష్టాలకు బ్రేక్‌..60 డాలర్లకు పైన చమురు

Friday 23rd August 2019
Markets_main1566536265.png-27963

చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి దారులు సరఫరాను కఠినతరం చేయడంతో చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. దీనితో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ మానెటరీ పాలసీపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి ఉండడం కూడా చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 10 సెంటులు పెరిగి బారెల్‌ 60.02 డాలర్లకు చేరుకోగా డబ్యూటీఐ క్రూడ్‌ 3 సెంటులు పెరిగి బారెల్‌ 55.38 డాలర్లకు చేరుకుంది. ‘ఈ రోజు సాయంత్రం జరగనున్న జాక్సన్‌ హోలి(ఫెడ్‌ చైర్మన్‌ ప్రసంగం) సమావేశం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు’ అని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజి ఓండా సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు జెఫ్రీ హాలీ అన్నారు. ఆసియా మార్కెట్‌లలో తక్కువ వాల్యుమ్‌ల వద్ద లాభాల స్వీకరణ జరుగుతోందని తెలిపారు. 
   జాక్సన్ హోల్‌(అమెరికాలోని ఓ ప్రదేశం)లో శుక్రవారం జరగనున్న సెంట్రల్ బ్యాంకర్ల సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం ద్వారా యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఈ ఏడాది రెండవ సారి ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? లేదా? అనే అంశంపై అంచనాలు వెలువడే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. కానీ ఇద్దరు ఫెడ్‌ అధికారులు  వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదని బుధవారం అనడంతో, యుఎస్‌ మానెటరీ పాలసీని సులభతరం చేసే చర్యలు ఫెడ్‌ సమావేశంలో ఉండవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తే యుఎస్‌ డాలర్‌ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలపడుతుంది. ఫలితంగా చమురు మార్కెట్‌లో డాలర్‌తో చెల్లింపులు చేసేవాళ్లు అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది.  
  చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఒపెక్‌ తమ చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను తగ్గించడంతో వరుసగా రెండు నెలల నుంచి చమురు ధరలు తగ్గాయి. అయినప్పటికి  ఒపెక్(చమురు ఉత్పత్తి , ఎగుమతి దేశాల సమాఖ్య), రష్యా తమ చమురు ఉత్పత్తి కోతలను పొడిగించడంతో పాటు యుఎస్‌ ఆంక్షల వలన ఇరాన్‌, వెనిజులా నుంచి ఎగుమతులు తగ్గడంతో చమురు ధరలకు మద్ధతు లభిస్తోంది.



You may be interested

నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు

Friday 23rd August 2019

నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు అన్యూహంగా లాభాల్లోకి మళ్లాయి. ఎఫ్‌పీఐలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీలను విధింపును కేంద్రం ఎత్తివేస్తుందనే వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమైంది. ప్యాకేజీ ఉద్దీపన చర్యలు ఉండవని కేంద్రం స్పష్టం చేయడంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు, రూపాయి ఎనిమిది నెలల కనిష్టానికి పతనం తదితర కారణాలతో సూచీలు నిన్న 6నెలల కనిష్టం వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నిన్నటి నష్టాల ముగింపును

2వారాల కనిష్టం వద్ద పసిడి

Friday 23rd August 2019

ప్రపంచమార్కెట్లో శుక్రవారం పసిడి ధర 2వారాల కనిష్టస్థాయి దిగువను ట్రేడ్‌ అవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ బలపడటంతో పసిడి ధరపై ఒత్తిడి పెరుగుతోంది. ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నేటిరాత్రి జాక్సన్‌ హోల్‌ సదస్సు ప్రసంగించనున్న నేపథ్యంలో బాండ్‌ ఈల్డ్‌ బలపడుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్నటి ముగింపు(1,503.85 డాలర్లు)తో పోలిస్తే 5డాలర్లు నష్టపోయి 1,503.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల వెలువడిన జూలై ఫెడ్‌

Most from this category