News


భయపెడుతున్న చైనా వృద్ధి రేటు..నష్టాల్లో చమురు

Friday 18th October 2019
Markets_main1571375038.png-28974

  చైనా మూడవ త్రైమాసికపు జీడీపీ వృద్ధిరేటు 3 దశాబ్దాల కనిష్ఠానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేయడంతో చమురు ధరలు శుక్రవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన, ప్రపంచంలోనే అత్యధిక చమురు వినియోగ దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం విదితమే. ఉదయం 10.17 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.55 శాతం నష్టపోయి బారెల్‌ 59.58 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.22 శాతం నష్టపోయి 53.81 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా, సెప్టెంబర్‌ త్రైమాసికానికి చైనా జీడీపి వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంటుందని, 1992 మొదటి త్రైమాసికం తర్వాత ఇదే కనిష్ఠమని రాయిటర్స్‌ పోల్‌ విశ్లేషకులు తెలిపారు. చైనా ప్రభుత్వం, మూడవ క్వార్టర్‌కు సంబంధించి జీడీపీ వృద్ధిరేటును, ఇతర ఆర్థిక డేటాను ఈ రోజు విడుదల చేయనుంది. బలహీన ఆర్థిక వ్యవస్థ వలన చైనా మరిన్ని ఉద్దీపన చర్యలను తీసుకోవడంలో ఒత్తిడి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. ‘చైనా విడుదల చేయనున్న పరిశ్రమల పనితీరు డేటా, స్థిర ఆస్తి పెట్టుబడుల డేటా కమోడిటి మార్కెట్లో ప్రభావం చూపనుంది’ అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్‌ ఓ నివేదికలో తెలిపింది. దీనికితోడు యుఎస్‌ చమురు నిల్వలు అక్టోబర్‌ 11తో ముగిసిన వారానికి గాను 93 లక్షల బారెల్స్‌ పెరిగాయని గురువారం ప్రభుత్వ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌ ప్రకటించింది. కాగా ఈ పెరుగుదల 29 లక్షల బారెల్స్‌గా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేయడం గమనార్హం. 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌క్యాప్‌ @ 9 లక్షల కోట్లు!

Friday 18th October 2019

-ఆల్‌టైం గరిష్ఠానికి కంపెనీ షేరు దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,  శుక్రవారం సెషన్‌లో రూ. 9 లక్షల కోట్లు మార్కెట్‌ క్యాప్‌ ఉన్న మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. కంపెనీ సెప్టెంబర్‌ ఫలితాలలో బలమైన ఫలితాలను ప్రకటిస్తుందనే అంచనాల నేపథ్యంలో రిలయన్స్‌ షేరు విలువ 2 శాతానికి పైగా ర్యాలీ చేసీ రూ. 1427.90 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ కంపెనీ

పీవీఆర్‌ ఆదాయం రూ.979 కోట్లు

Friday 18th October 2019

37 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ చెయిన్‌,  పీవీఆర్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసిక కాలంలో రూ.49 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.35 కోట్లతో పోల్చితే 35 శాతం వృద్ది సాధించామని పీవీఆర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.715 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.979 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా

Most from this category