News


ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌ జంప్‌

Wednesday 24th April 2019
Markets_main1556097152.png-25317

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర ఆరునెలల గరిష్టస్థాయిలను రికవరీ కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పెట్రోరంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎన్‌అండ్‌పీ బీఎస్‌ఈ అయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఇరాన్‌ నుంచి దిగుమతి అయ్యే ముడిచమురు మీద అగ్రరాజ్యమైన అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆరునెలల గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా ముడిచమురు మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో షేర్లు కనిష్ట స్థాయిల ట్రేడ్‌ అవుతుండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసి 14,919 గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 1.79శాతం లాభంతో 14902.87ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లోని హెచ్‌పీసీఎల్‌ 5శాతం, బీపీసీఎల్‌ 3శాతం, గెయిలర్‌, ఐఓసీ 2.50శాతం, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆయిల్‌ ఇండియా షేర్లు 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఐజీఎల్‌, కాస్ట్రోల్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. You may be interested

39000 పైన ముగిసిన సెన్సెక్స్‌

Wednesday 24th April 2019

చివరి గంటలో కొనుగోళ్లతో భారీ లాభపడ్డ సూచీలు మూడురోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ 150 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ గత మూడు రోజులుగా భారీగా పతనమైన మార్కెట్లో కనిష్టస్థాయి వద్ద చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు, ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ మరో రోజులో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్‌ బుధవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 489 పాయింట్ల లాభంతో 39,054.68 వద్ద, నిఫ్టీ 150.20 పాయింట్లు పెరిగి 11,726.15 వద్ద స్థిరపడ్డాయి. దీంతో మార్కెట్ మూడు రోజుల వరుస

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 24th April 2019

స్వల్పలాభాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ అరశాతం నష్టపోయింది. ఇండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 2శాతం నష్టపోగా, వేదాంత, 1.50శాతం, ఏపిల్‌ అపోలో 1శాతం, నాల్కో, హిందాల్కో 0.75శాతం, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం క్షీణించాయి. హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు పావుశాతం పతనమయ్యాయి. అలాగే సెయిల్‌ 3.50శాతం, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ 2.50శాతం,

Most from this category