ఆయిల్ మార్కెటింగ్ షేర్ల ర్యాలీ..బీపీసీఎల్ 4% అప్
By Sakshi

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు గురువారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 11.06 సమయానికి హెచ్‌పీసీఎల్(హిందుస్తాన్ పెట్రోలియం) షేరు 4.38 శాతం లాభపడి రూ. 323.00 వద్ద ట్రేడవుతోంది.
చమురు ధరలు తగ్గడం, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం, బీపీసీఎల్(భారత్ పెట్రోలియం)లోని తన పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయం తీసుకోవడంతో బీపీసీఎల్ షేరు గత కొన్ని సెషన్ల నుంచి ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షేరు గురువారం ట్రేడింగ్‌లో కూడా 4 శాతం లాభపడి రూ. 516.80 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. బీపీసీఎల్ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వానికి అంచనాల కంటే అధిక నిధులు సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తుండడం గమనార్హం.
చమురు ధరలు తగ్గడంతో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసీ) షేరు కూడా లాభాల్లో ట్రేడవుతోంది. ఈ షేరు 1.11 శాతం లాభపడి రూ. 150.20 వద్ద ట్రేడవుతోంది.
You may be interested
లాభాల బాటలో టాటామోటర్స్ .!
Thursday 3rd October 2019నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లోనూ టాటామోటర్స్ షేర్లు గురువారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్ఈలో ఉదయం సెషన్లో 5.5శాతం పెరిగాయి. అమెరికాలో వార్షిక ప్రాతిపాదికన ఈ సెప్టెంబర్‌లో జేఎల్ఆర్ అమ్మకాలు పెరిగాయి. మరోవైపు దేశీయంగా ఇదే నెలలో ఏడాది ప్రాతిపాదికన అమ్మకాలు 50శాతం క్షీణించాయి. అయితే... నెల ప్రాతిపదికన ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో రిటైల్ వాహన విక్రయాలు 11శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా వాహన విక్రయాలు మరితం
నష్టాల్లో మెటల్ షేర్లు..హిందల్కో 3% డౌన్
Thursday 3rd October 2019యుఎస్ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతోపాటు, యూరోప్ దేశాలలో కార్పోరేట్ లాభాలు తగ్గడంతో యుఎస్-చైనా ట్రేడ్‌వార్ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి వెళుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఆర్థిక మాంధ్యం భయాల కారణంగా అంతర్జాతీయంగా మెటల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.41 సమయానికి నిఫ్టీ మెటల్