News


చమురు తగ్గుదల ఎఫెక్ట్‌...పెట్రో షేర్లకు జోష్‌

Thursday 23rd January 2020
Markets_main1579770428.png-31138

భారీగా తగ్గిన చమురు ధరలు
6 శాతం జంప్‌చేసిన ఐవోసీ

చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో మొదలైన చమురు ధరల పతనం గురువారం ఆసియా ట్రేడింగ్‌లో సైతం కొనసాగింది. నాలుగు శాతంపైగా క్షీణించడంతో విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 7 వారాల కనిష్టానికి చేరాయి. దీంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది.

లాభాల బాటలో
చమురు ధరలు నీరసించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐవోసీ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 121 వద్ద ట్రేడవుతోంది. ఐవోసీలో కేంద్ర ప్రభుత్వానికి 51.50% వాటా ఉంది. ఇతర కౌంటర్లలో బీపీసీఎల్‌ షేరు 3.5  శాతం ఎగసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా హెచ్‌పీసీఎల్‌ షేరు 2 శాతం పుంజుకుని రూ. 250 వద్ద కదులుతోంది. 
ఐవోసీ జోరు
ఘనాకు చెందిన జాతీయ పెట్రోలియం​అధీకృత సంస్థ(ఎన్‌పీఏ)తో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ పేర్కొంది. ఘనా దేశపు ఎల్‌పీజీ ప్రోత్సాహక విధానాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యం, తదితర సహకారాలను అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐవోసీ తెలియజేసింది. దీనిలో భాగంగా లైసెన్సింగ్‌, లీగల్‌, ఎకనమిక్స్‌, బాట్లింగ్‌, ధరలు తదితర పలు అంశాలలో సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా పెట్రోలియం రిఫైనింగ్‌ తదితర డౌన్‌స్ట్రీమ్‌ సర్వీసులకు సైతం అసిస్టెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలియజేసింది. 



You may be interested

టెలికం ఎస్‌పీవీ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం?!

Thursday 23rd January 2020

టెలికం రంగానికి సాయం చేసేందుకు ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు బిజినెస్‌స్టాండర్డ్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సీఓఏఐ తన సభ్యులకు పంపినట్లు చెబుతున్న వివరాలను నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం టెలికం కంపెనీలు తమ ఏజీఆర్‌ బకాయిలను వార్షిక వాయిదాల రూపంలో ఎస్‌పీవీకి జమ చేయమని ప్రభుత్వం కోరనుంది. ఈ మొత్తాలను ఈక్విటీకింద పరిగణిస్తారు. దీంతో పాటు టెలికం కంపెనీలకు అవసరమైన 5జీ

యస్‌ బ్యాంక్‌ షేరు దూకుడు

Thursday 23rd January 2020

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ తాజాగా పేర్కొన్నారు. దేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో యస్‌బ్యాంకు ఒక ప్రముఖమైన బ్యాంకు అంటూ దావోస్‌ సదస్సులో కితాబునిచ్చారు. ఇంత ప్రాముఖ్యమున్న బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్‌బీఐని కోరవచ్చన్న అంచనాల మధ్య రజనీశ్‌ వ్యాఖ్యలు

Most from this category