News


అమ్మకాల ఒత్తిడిలో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Thursday 3rd January 2019
Markets_main1546501754.png-23385

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయ ఆయిల్‌ మార్కెటిం‍గ్‌ కంపెనీల షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఆర్థిక వృద్ధి మందగమనంతో క్రూడాయిల్‌కు డిమాండ్‌ తగ్గడం, సరఫరా పెరగడంతో గత కొన్ని నెలలుగా క్రూడాయిల్‌ ధర క్షీణిస్తూ వస్తోంది. క్రూడ్‌ ధరలు తగ్గితే ఇప్పటికే ఎక్కువ ధరల వద్ద కొన్న నిల్వలను ఓఎంసీలు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. అలాగే ఈ కంపెనీలు నిర్వహిస్తున్న రిఫైనరీల మార్జిన్లు క్షీణించడంతో డిసెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల(ఓఎంసీ) ఎర్నింగ్స్‌ దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్‌పీసీఎల్‌  బీపీసీఎల్‌  ఐఓసీ  షేర్లు 4శాతం నుంచి 3శాతం నష్టపోయాయి.
హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.253.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు పెరగడంతో 4శాతం నష్టపోయి రూ.247.20 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం. గం.1:00లకు షేరు గతముగింపు ధర(రూ.256.55)తో 2.50శాతం నష్టంతో రూ.251ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.352.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు పెరగడంతో 3శాతం నష్టపోయి రూ.348.15 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం.గం.1:00లకు షేరు గతముగింపు ధర(రూ.357.95)తో 1.50శాతం నష్టంతో రూ.353ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఐఓసీ:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.137.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు పెరగడంతో 4శాతం నష్టపోయి రూ.133.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం.గం.1:00లకు షేరు గతముగింపు ధర(రూ.137.25)తో 2.50శాతం నష్టంతో రూ.134ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

విలీనం ఎఫెక్ట్‌: భారీ నష్టాల్లో దేనా, విజయా బ్యాంక్‌ షేర్లు

Thursday 3rd January 2019

3.50శాతం లాభపడ్డ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)లో దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినెట్‌ విలీనం తెలపడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 3.50శాతం లాభపడ్డాయి. మరోవైపు ఈ బ్యాంకులో విలీనమయ్యే దేనా బ్యాంక్‌ 19 శాతం నష్టపోయి రూ.14.55కు చేరుకుంది. అలాగే విజయా బ్యాంక్‌ షేరు 7శాతం నష్టపోయి రూ.48 వద్ద ట్రేడవుతోంది. విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోనున్న బ్యాంక్

ఆరున్నర నెలల గరిష్టానికి పసిడి

Thursday 3rd January 2019

ఆర్థిక వృద్ధి మందగమనం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అస్థిరత పసిడి ధరకు కలిసొస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం 9డాలర్లు లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత సైతం పసిడి ర్యాలీకి సహకరిస్తోంది. ఉదయం 11:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 8.85 డాలర్ల లాభపడి 1,292.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది పసిడి ధరకు ఆరున్నర నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. జపాన్‌ కరెన్సీ యెన్‌ ర్యాలీ

Most from this category