News


ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల పతనం

Friday 3rd January 2020
Markets_main1578028020.png-30644

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో, బీపీసీఎల్‌ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని ప్రభుత్వ ఉన్నధికారి ఒకరి చెప్పడంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నష్టాల్లో బాట పట్టాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3శాతం నష్టపోగా, ఐఓసీ మాత్రం​ అరశాతం దాకా నష్టపోయింది. 

 శుక్రవారం వేకువజామున అమెరికా జరిపిన దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. రాకెట్ దాడిలో ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రా‍‍చ్య దేశంలో నెలకొన్న ఉద్రికత్తలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు ఒక్కసారిగా భగ్గమన్నాయి. చమురు ధరలు పెరిగితే.. మార్జిన్లు క్షీణించే అవకాశముండటంతో ఇన్వెస్టర్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లను విక్రయిస్తున్నారు.  

ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీల్లో ఈ ఆర్థిక సంవత్సరం వ్యూహాత్మక వాటా ఉండకవపోచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేసాయి.   

బీపీసీఎల్‌ షేరు:- ఇంట్రాడేలో 3శాతం నష్టపోయి రూ.473.00 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:15ని.లకు 2శాతం నష్టంతో రూ.478.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
హెచ్‌సీఎల్‌ షేరు:- ఇంట్రాడేలో 3శాతం నష్టపోయి రూ.261.70 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:20ని.లకు 1.75శాతం నష్టంతో రూ.265.00  వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఐఓసీ షేరు:-  ఇంట్రాడేలో 3శాతం నష్టపోయి రూ.126.20 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:30ని.లకు 0.32శాతం నష్టంతో రూ.126.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ డౌన్‌

Friday 3rd January 2020

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగులో కదులుతున్నాయి. గురువారం రాత్రి బాగ్దాద్‌పై అమెరికా చేపట్టిన వైమానిక దాడులలో ఇరాన్‌, ఇరాక్‌ అధికారులు కొంతమంది మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు రివ్వుమన్నాయి. దీంతో దేశీయంగా చమురు దిగుమతుల బిల్లు పెరగనుందన్న అంచనాలు పెరిగి రూపాయి డీలాపడింది. దీనికితోడు ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను ప్రభుత్వం చేరకపోవచ్చన్న

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు రయ్‌

Friday 3rd January 2020

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ టీసీఎస్‌ లిమిటెడ్‌ ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌ ఇరాక్‌లోని బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా చేపట్టిన వైమానిక దాడులలో ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన ప్రముఖ వ్యక్తులు మరణించినట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ బలహీనపడగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం నేలచూపులతో ప్రారంభమై నీరసంగా కదులుతున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 113 పాయింట్లు క్షీణించి 41,514ను తాకగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో

Most from this category