News


ఆయిల్‌ ఇండియా షేర్ల బై బ్యాంక్‌

Saturday 24th November 2018
Markets_main1543042637.png-22360

-ఒక్కో షేర్‌ బైబ్యాక్‌ ధర రూ.215
- మొత్తం రూ.1,085 కోట్లతో బైబ్యాక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ ఇండియా షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆయిల్‌ ఇండియా పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది. దేశంలోనే రెండో అతి పెద్ద చమురు అన్వే‍షణ సంస్థ అయిన ఆయిల్‌ ఇండియా వద్ద ప్రస్తుతం రూ.20,000 కోట్ల మేర నగదు నిల్వలున్నాయి. ఈ మిగులు నిల్వలను వాటాదారులకు తిరిగి ఇచ్చివేసే ఉద్దేశంతో షేర్ల బైబ్యాక్‌ చేస్తున్నామని ఆయిల్‌ ఇండియా తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌కు లీడ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, లీగల్‌ అడ్వైజర్‌గా సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ వ్యవహరిస్తాయి. కాగా ఆయిల్‌ ఇండియా షేర్లు బీఎస్‌ఈలో గురువారం రూ.219 ధర వద్ద ముగిశాయి. ఆయిల్‌ ఇండియాలో కేంద్రానికి 66.13 శాతం వాటా ఉంది.
షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.5,000 కోట్లు
ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం నగదు నిల్వలు భారీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసింది. అధిక డివిడెండ్లు చెల్లించాలని, లేదా షేర్ల బైబ్యాక్‌ చేయాలని ఆయా సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థల్లో సహజంగానే ప్రభుత్వానికి అధిక వాటా ఉండటంతో డివిడెండ్లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్‌ జరిపినా, కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు రాబట్టుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కోల్‌ ఇండియా, భెల్‌, ఎన్‌హెచ్‌పీసీ, నాల్కో, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ తదితర డజన్‌ కంపెనీలు షేర్లను బైబ్యాక్‌ చేయనున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ రూ.15,000 కోట్లు సమీకరించగలిగింది.



You may be interested

11శాతం తగ్గిన పండుగ వాహన విక్రయాలు

Saturday 24th November 2018

నిస్సారంగా పండుగల సీజన్‌ -పీవీ, టూ వీలర్ల అమ్మకాలు డౌన్‌ -ప్రభావం చూపిన ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య -ఫాడా వెల్లడి న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్‌ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్‌లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూ-వీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌(ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్‌ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్‌ అశీష్‌ హర్షరాజ్‌

నాత్యావసరాలను నుంచి ఔషధాలకు వరకు అన్నీ డెలవరీ

Saturday 24th November 2018

– నిత్యావసరాల నుంచి ఔషధాల దాకా అన్నీ డెలివరీ – డిసెంబర్‌ 15 నుంచి సేవలు ప్రారంభం – స్థానిక సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలతో టైఅప్‌ న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఫుడ్‌ డెలివరీ సేవలకు మాత్రమే పరిమితమైన స్విగ్గీ మరిన్ని విభాగాల్లోకి విస్తరిస్తోంది. నిత్యావసరాలు, ఔషధాలు మొదలైన వాటి డెలివరీ సేవలకు సంబంధించి లోకల్‌ కామర్స్‌ విభాగంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్‌ 15న వీటిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం స్థానిక సూపర్‌

Most from this category