News


స్థిరంగా చమురు

Monday 29th July 2019
Markets_main1564373981.png-27365

బహుళ పార్టీ అణు ఒప్పందంపై సంతకం చేసిన వారితో జరిగిన అత్యవసర సమావేశం ‘నిర్మాణాత్మక’ంగా ఉందని ఇరాన్‌ అభివర్ణించడంతో సోమవారం(జులై 29) ఆయిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 56.08 డాలర్లకు పడిపోయింది. కాగా డబ్ల్యుటిఐ గత వారం 1 శాతం లాభపడింది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 63.23 డాలర్లకు చేరుకుంది.  గత వారం ఈ ధరలు 1.6 శాతం పెరిగాయి.
  ఇరాన్ 2015 అణు ఒప్పందంలోని పార్టీలతో జరిగిన అత్యవసర సమావేశం నిర్మాణాత్మకంగా ఉందని, కానీ పరిష్కరించబడని సమస్యలు కూడా ఉన్నాయని ఇరాన్ అధికారి అబ్బాస్ అరాక్చి ఆదివారం తెలిపారు. యూరోపియన్లు ఈ ఒప్పందాన్ని రక్షించడంలో విఫలమైతే టెహ్రాన్ తన అణు కట్టుబాట్లను తగ్గించుకుంటూ పోతుందని వివరించారు. 
  బ్రిటిష్ ట్యాంకర్‌ను విడుదల చేయడానికి ఇరాన్‌ నిరాకరించడంతో ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు మార్గమైన హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వడ్డీ రేట్లు తగ్గుతాయని భావిస్తున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్‌ బ్యాంక్‌ సహా ప్రధాన కేంద్ర బ్యాంకు సమావేశాలు ఈ వారం జరగనుండడంతో  వీటిపై వ్యాపారులు, పెట్టుబడిదారులు దృష్ఠి సారించనున్నారు. 



You may be interested

68.94 వద్ద రూపీ ప్రారంభం

Monday 29th July 2019

చమురు ధరలు తగ్గడంతో పాటు దేశియ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో రూపీ డాలర్‌ మారకంలో సోమవారం 11 పైసలు బలపడి 68.94 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ 15 పైసలు బలపడి 69.05 వద్ద ముగిసింది. ఉదయం 9.42 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 68.93 వద్ద ట్రేడవుతోంది. 

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 29th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టాటాస్టీల్‌ స్పాంజ్‌ ఐరన్‌:- ఇండియ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ‘‘స్థిరత్వం’’ అవుట్‌లుక్‌ రేటింగ్‌ కేటాయించింది.  ఉషా మార్టిన్‌:- బ్యాంకు రుణ సదుపాయ సౌకర్యాలపై  ఇండియ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ రేటింగ్‌ను బిబి(+)నుంచి బిబిబి(+)కు పెంచింది.  నవనీత్‌ ఎడ్యుకేషన్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ రూ.300 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.  ఆర్తి డ్రగ్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ను క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ

Most from this category