News


అక్టోబర్‌ నుంచి అదిరిపోయే ర్యాలీ!

Thursday 11th July 2019
Markets_main1562837840.png-26989

సంజీవ్‌ భాసిన్‌ అంచనా
వచ్చే రెండేళ్ల కాలం కొనసాగే భారీ ర్యాలీ దేశీయ సూచీల్లో వచ్చే అక్టోబర్‌లో ఆరంభం అవుతుందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను పెంపుదలల గురించి అనవసరంగా ఆందోళన పడుతున్నారని, నిజానికి బడ్జెట్లో ఎలాంటి నెగిటివ్‌ లేదని తెలిపారు. ఈక్విటీ ఆదాయాలు భారీగా ఉంటే వాటిపై వేసే పన్నుమాత్రమే పెరుగుతుందని, ఈ మాత్రం పెరుగుదలకూడా సహించలేకపోతే ఈక్విటీల నుంచి వైదొలిగి బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌ వినిమయ ప్రోత్సాహక బడ్జెటని కొనియాడారు. ప్రస్తుతం రూపీ ఆరు నెలల గరిష్ఠం వద్ద, బాండ్‌ ఈల్డ్స్‌ మూడేళ్ల కనిష్ఠాల వద్ద ఉన్నాయన్నారు. దీన్ని బట్టి వచ్చే మూడునాలుగు నెలలు ఈక్విటీలు నేల చూపులు చూస్తాయని, ఇదే సమయంలో బాటమ్‌ అవుట్‌ అవుతాయని అంచనా వేశారు. మూడు నెలల అనంతరం సూచీలు బాగా బుల్లిష్‌గా మారతాయని, దీర్ఘకాలం పాటు అత్యంత మంచి ర్యాలీ మనం ఆపైన చూస్తామని అభిప్రాయపడ్డారు. 
ప్రస్తుత పతనంలో మంచి స్టాకులు కొనేందుకు యత్నించాలని సంజీవ్‌ సూచించారు. మార్కెట్లో నిరాశావాతావరణం మరీ ఎక్కువైందని, ఇలాంటప్పుడే కొనుగోళ్లు జరపాలని చెప్పారు. మనకు తెలియకుండా ఎన్‌పీఏల విషయంలో మంచి పురోగతి నమోదవుతోందని, క్రమంగా ఎన్‌పీఏలు ఉండకపోవచ్చని, చాలా కార్పొరేట్లు బ్యాంకులతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నాయని తెలిపారు. అందువల్ల కార్పొరేట్‌బ్యాంకులపై తాము అత్యంత పాజిటివ్‌గా ఉన్నామన్నారు. పీఎస్‌యూ బ్యాంకులతో పాటు మిడ్‌క్యాప్‌ బ్యాంకులు కూడా మంచి మెరుగుదల చూపుతాయన్నారు.

ఈ రంగం లార్జ్‌క్యాప్స్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ బ్యాంకులు ముందంజలో ఉంటాయన్నారు. పీఎస్‌యూబ్యాంకుల్లో బీఓబీ, కెనరాబ్యాంక్‌, మిడ్‌క్యాప్స్‌లో డీసీబీ, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులు ఫలితాల్లో పాజిటివ్‌గా ఆశ్చర్యపరుస్తాయాన్నరు. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌ను కాంట్రా బెట్‌గా భావించవచ్చని చెప్పారు. You may be interested

ఆటో షేర్ల పరుగు

Thursday 11th July 2019

ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.63 శాతం లాభపడి 7,633.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌ ఫోర్జ్‌ 4.63 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 4.29 శాతం, టాటా మోటర్స్‌ 3.63 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 3.06 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 2.03 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. వీటితో

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 11th July 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం 0.80శాతం(260 పాయింట్లు) మేర లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 185 పాయింట్ల భారీ గ్యాప్‌తో 30,707.00 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ సెక్టార్లో స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో ఆరంభ లాభాల్ని నిలుపుకోలిగింది. ఇంట్రాడేలో ఒకదశలో 260 పాయింట్లు పెరిగి 30,781.70 వద్ద స్థాయికి అందుకుంది. మధ్యాహ్నం గం 2:30ని.లకు షేరు ఇండెక్స్‌

Most from this category