News


రియల్టీ ఒబేరాయ్‌ షేర్లకు ‘‘ఐటీ’’ షాక్‌..!

Thursday 22nd August 2019
Markets_main1566457778.png-27946

రియల్టీ రంగలోని ఒబేరాయ్‌ రియల్టీ షేర్లు గురువారం ట్రేడింగ్లో 6శాతం పతనమయ్యాయి. ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు చేసినట్లు కంపెనీ తెలపడటం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.504.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆదాయ పన్ను శాఖ ఆగస్ట్‌ 20 నుంచి కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కంపెనీలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖకు కంపెనీ నుంచి పూర్తి సహాయ సహకరాలు అందిస్తున్నాం. ఏ ఉద్దేశ్యంతో సోదాలు నిర్వహిస్తుందనే అంశంపై ఐటీ నుంచి వివరణ రావాల్సి ఉంది అని కంపెనీ వివరణనిచ్చింది. ఐటీ సోదాల నేపథ్యంలో నేడు  ఒబేరాయ్‌ రియల్టీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 7శాతం వరుకు నష్టపోయి రూ.476.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేర్లు క్రితం ముగింపు(రూ.512.65)తో పోలిస్తే 5.50శాతం నష్టంతో రూ.485.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.351.75 రూ.641.70లుగా నమోదయ్యాయి. 



You may be interested

లాభల్లో ఎఫ్‌ఎంసీజీ..3% పెరిగిన బ్రిటానియా

Thursday 22nd August 2019

వివిధ రంగాలకు చెందిన స్టాకులలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం దేశియ మార్కెట్‌ నష్టాల్లో ట్రేడవుతుంది. కాగా ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) షేర్లలో కొనుగొలు పెరగడంతో, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.43 సమయానికి 0.75 శాతం పెరిగి 28,612.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  హెవి వెయిట్‌ షేర్లయిన బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 3.46 శాతం లాభపడి రూ. 2,393.50 వద్ద, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 1.60 శాతం పెరిగి రూ.

రియల్టీ సంక్షోభం..సంపన్నుల రుణ చెల్లింపులపై అనుమానాలు!

Thursday 22nd August 2019

గత ఏడాది ప్రారంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం రుణ మార్కెట్‌లో ఉన్న పెద్ద వ్యాపారవేత్తలను కూడా విడిచి పెట్టడంలేదు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రియల్టీ మందగమనం వలన ఈ రంగంతో ముడిపడి ఉన్న అజయ్‌ పిరమల్‌, పల్లోంజి మిస్త్రీ,  మంగల్‌ ప్రభాత్‌ లోధా(బీజేపీ ముంబై యూనిట్‌ అధ్యక్షుడు) వంటి భారతీయ సంపన్న వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  వ్యాపార వాతావరణం అధ్వాన్నంగా తయారవ్వడంతో పాటు ఫండింగ్‌ ఖర్చులు పెరగడంతో, ఈ వ్యాపారవేత్తలకు చెందిన

Most from this category