News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 17th October 2019
Markets_main1571290624.png-28948

స్వల్పలాభంతో ట్రేడ్‌ అవుతున్న మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ఉదయం సెషన్‌లో 1.50శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,369.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అమ్మకాలు నెలకొనడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.50శాతం నష్టపోయి 2,352.10 స్థాయికి పతనమైంది. ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2352.1)తో పోలిస్తే 2,364.85 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో 4.50శాతం నష్టపోయింది. వేదాంత లిమిటెడ్‌ 2.50శాతం, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 2శాతం క్షీణించాయి. జిందాల్‌ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 1.50శాతం పతనమయ్యాయి. సెయిల్‌, ఏపిల్‌ అపోలో, ఎన్‌ఎండీసీ, రత్నమని మెటల్స్‌, మెయిల్‌ షేర్లు 1శాతం నుంచి ఆరశాతం నష్టపోయాయి. ఇందే సమయానికి కోల్‌ ఇండియా, 1.60శాతం లాభపడగా, హిందూస్థాన్‌ జింక్‌ అరశాతం పెరిగింది. 
ఇదే సమయానికి నిఫ్టీ 10.50 పాయింట్ల లాభంతో 11,474.50 వద్ద, సెన్సెక్స్‌ 54.55 పాయింట్లు పెరిగి 38,653.54 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఫండ్స్‌ కొనుగోళ్ల జోరు

Thursday 17th October 2019

దేశీయ మ్యూచువల్ ఫండ్లు ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు ఆస్తకి చూపుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ల ఫోర్ట్‌ఫోలియోలో ప్రైవేట్‌రంగ బ్యాంకుల హోల్డింగ్‌ వాటా రికార్డు స్థాయిలో 20.8శాతానికి పెరిగినట్లు మోతిలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 470 బేసిస్‌ పాయింట్ల అధికమని గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తుండం, కంపెనీ ఆదాయాల తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆర్థిక

షేర్లపై జీడీపీ ప్రభావం చాలా స్వల్పం!

Thursday 17th October 2019

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా జీడీపీ వృద్ధికి, స్టాక్స్‌ ధరలు మధ్య చాలా స్వల్ప సంబంధం ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌నివేదిక వెల్లడించింది. అయితే ఆశ‍్చర్యకరంగా జీడీపీ ట్రెండ్‌ను తెలుసుకోవడానికి మాత్రం స్టాక్‌ ధరలు మంచి సూచికలుగా పనికివస్తాయని తెలిపింది. కానీ జీడీపీ ట్రెండ్‌ ఆధారంగా స్టాక్స్‌ ధరలను అంచనా వేయలేమని పేర్కొంది. స్టాక్స్‌ ధరలు పెరగడమనేది జీడీపీ నిజ వృద్ధికి అనులోమానుపాతంలో ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ తాజా రిసెర్చ్‌ప్రకారం కార్పొరేట్‌

Most from this category