News


బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Tuesday 7th January 2020
Markets_main1578370597.png-30723

పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌కు డిమాండ్‌
ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 9.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌చేసింది.  41,176కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 145 పాయింట్లు ఎగసి 12,137 వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ టెక్నాలజీ దిగ్గజాల అండతో సోమవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 0.25-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నేలచూపులతో కదులుతున్న బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకుతోడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం ప్రభావం చూపుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 2 శాతం లాభపడింది. వివరాలు చూద్దాం..

పోటాపోటీ
ఎన్‌ఎస్‌ఈలో ఓవైపు పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌, మరోపక్క ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ సైతం 2 శాతం చొప్పున ఎగశాయి. పీఎస్‌యూ ఇండెక్స్‌లో భాగమైన కెనరా, యుకో బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, బీవోబీ, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రయివేట్‌ రంగ విభాగంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, సిటీయూనియన్‌ 3.7-1 శాతం మధ్య ఎగశాయి.



You may be interested

కొద్ది రోజుల్లో 11800 పాయింట్ల వరకు పతనం !?

Tuesday 7th January 2020

నిపుణుల అంచనా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సోమవారం దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. అయితే మంగళవారం సూచీలు వేగంగా రీబౌన్స్‌ అవుతున్నాయి. నిఫ్టీ కీలక 12100 పాయింట్ల పైన ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ కీలక మద్దతులు కోల్పోయినందున రాబోయే రోజుల్లో 11800- 11850 పాయింట్ల వరకు పతనం కావచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారితే పతనం 11600 పాయింట్ల వరకు ఉండొచ్చంటున్నారు. 1. ఎడెల్‌వీజ్‌ అనలిస్టు సాగర్‌:

మంగళవారం వార్తల్లోని కంపెనీలు

Tuesday 7th January 2020

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ తాజాగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. సోమవారం టెక్నాలజీ దిగ్గజాల అండతో అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 0.25-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. దీంతో దేశీయంగా నేడు(మంగళవారం) ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లు గ్యాపప్‌తో ప్రారంభంకావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విభిన్న వార్తల కారణంగా కొన్ని

Most from this category