News


సెప్టెంబర్‌ కల్లా ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ !

Tuesday 7th January 2020
Markets_main1578368708.png-30719

  • వెల్లడించిన ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ విక్రమ్‌ లిమాయే 

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)  ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా  వచ్చే అవకాశాలున్నాయి. ఐపీఓ ప్రక్రియకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం కోరామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్‌ లిమాయే పేర్కొన్నారు. సెబీ ఆమోదం రాగానే మర్చంట్‌ బ్యాంకర్ల నియామక ప్రక్రియను ఆరంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో తమ ఐపీఓ ఉండొచ్చని వివరించారు. ఎన్‌ఎస్‌ఈలో వాటాలున్న కంపెనీలు తమ తమ వాటాల్లో కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో ఐపీఓ ద్వారా విక్రయిస్తాయని తెలిపారు. 

ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన సర్వర్లను నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది సభ్యులు దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ప్రస్తుతం సెబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ఆలస్యమవుతోంది. 

ఐపీఓకు ఈసాఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌...
ఈసఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది.  ఐపీఓ పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సం‍స్థ, సెబీకి ఈ బ్యాంక్‌ సోమవారం సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.800 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.176 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రస్తుత వాటాదారులు విక్రయిస్తారు. మొత్తం మీద ఐపీఓ సైజు రూ.976 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌  సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తాయి. 



You may be interested

మార్కెట్లోకి బీఎస్‌-6 సుజుకీ యాక్సెస్‌ 125

Tuesday 7th January 2020

ప్రారంభ ధర రూ. 64,800 న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్‌ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్‌.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం-ఢిల్లీ) వద్ద నిర్ణయించింది.

నిఫ్టీ 86 పాయింట్లు, సెన్సెక్స్‌ 307 పాయింట్లు అప్‌

Tuesday 7th January 2020

అమెరికా-ఇరాన్‌ సంక్షోభంతో క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో జోరుగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 307 పాయింట్ల లాభంతో 40,984 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 86 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,079 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. గత రాత్రి అమెరికా మార్కెట్‌ పాజిటివ్‌గా ముగియడంతో, తాజాగా ఆసియా సూచీలు సైతం రిబౌండ్‌కావడం.. ఇక్కడి ప్రారంభర్యాలీకి కారణమయ్యింది. అలాగే పసిడి ధర 1,560

Most from this category