News


ఈ లార్జ్‌క్యాప్స్‌ ఆకర్షణియం!

Thursday 29th August 2019
Markets_main1567069742.png-28095

దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు జూన్  2019 లో నమోదుచేసిన రికార్డు స్థాయి గరిష్ఠాల నుంచి 6-8 శాతం పడిపోయాయి. అన్నిటికన్నా స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌కు చెందిన స్టాకులు భారీగా నష్టపోవడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం లార్జ్‌ క్యాప్‌లలో కూడా చాలా వరకు స్టాకులు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఎస్‌ అండ్‌ పీ లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 27 స్టాకులు వరకు వాటి 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 10-30 శాతం పతనమయ్యాయి. ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, శ్రీ సిమెంట్,  సిమెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డిస్‌ లాబరేటరీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లతో పాటు పలు పెద్ద స్టాకులు డిస్కౌంట్‌లో ఉన్నాయి.

వివిధ లార్జ్‌క్యాప్స్‌ ప్రదర్శన వివరాలు...

ఇలా డిస్కౌంట్‌లో ఉన్న లార్జ్‌ క్యాప్‌ స్టాకుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మందుకు వస్తుంటారు. అయితే ఇలా పడిపోయిన లార్జ్‌క్యాప్స్‌ అన్నింటినీ బలమైన స్టాకులుగా పరిగణించకూడదని విశ్లేషకులు తెలిపారు. ప్రాథమిక లేదా నిర్మాణాత్మక కారకాల కారణంగా లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లోని కొన్ని స్టాక్‌లు ఈ ఏడాది భారీగా సంపద క్షీణతకు గురయ్యాయి. ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఈ కారకాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు తెలిపారు. అదేవిధంగా మంచి స్టాకులు కూడా ఆకర్షణీయమైన ధరల శ్రేణిలో లభిస్తున్నాయని తెలిపారు. 
     ఆర్థిక మందగమనం, లిక్విడిటీ ఆందోళనలు, బడ్జెట్‌లో పెద్ద ఉద్దీపన ప్రతిపాదనలు లేకపోవడం, ఎఫ్‌పీఐలతో సహా సూపర్ రిచ్‌లపై అదనంగా సర్‌చార్జిని విధించడం(ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది) వంటి అంశాలతో పాటు క్షీణించిన కార్పోరేట్‌ ఆదాయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతీశాయి. ‘పైన పేర్కొన్న లార్జ్‌ క్యాప్‌ స్టాకులలో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, బీపీసీఎల్‌(భారత పెట్రోలియం) మొదలైన వాటిలో దశలవారీగా ఇన్వెస్ట్‌చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ కంపెనీలు ప్రాథమికంగా ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇవ్వగలవు. పీఎన్‌బీ (వృద్ధి సమస్యలు), యూనిటెడ్‌ ఫాస్పరస్‌ లిమిటెడ్‌(యూపీఎల్‌) (అధిక రుణ స్థాయి సమస్యలు)లలో ఇన్వెస్ట్‌ చేయడానికి దూరంగా ఉండాలి’ అని రీసెర్చ్, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు.  

ప్రాథమికంగా బలంగా ఉన్న స్టాకులే బెటర్‌!    
సాధారణంగా, మార్కెట్ దిద్దుబాటుకు గురయిన సమయంలో ప్రాథమికంగా బలంగా ఉన్న స్టాకులు మార్కెట్‌ కంటే తక్కువగా నష్టపోతాయి. ‘ముఖ్యంగా మార్కెట్‌ 9 శాతానికి పైనే నష్టపోయిన ప్రస్తుత పరిస్థితులల్లో 30-50 శాతానికి పైగా దిద్దుబాటుకు గురయిన స్టాకులు మరింత పతనమయ్యే అవకాశం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సిమెన్స్, శ్రీ సిమెంట్ వంటి స్టాక్స్  20 శాతం కన్నా తక్కువ క్షీణించగా, ఇదే సమయంలో విస్తృత సూచీలు 30-40 శాతానికి పైగా పడిపోయాయి. ఈ విధంగా పోల్చిచూసినప్పుడు ఇన్వెస్టర్లు ప్రాథమికంగా బలంగా ఉన్న కంపెనీలను గుర్తించగలరు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డా. రెడ్డీస్‌ షేర్ల బ్రోకరేజి టార్గెట్‌లు బాగున్నాయి. ఇన్వెస్టర్లు ఇలాంటి లార్జ్‌ క్యాప్‌ స్టాకులను ఎంచుకోవాలి’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం నిఫ్టీ ఇండెక్స్‌, ఈ ఏడాది ప్రారంభంలో ఏ స్థాయి వద్దయితే ఉందో ఆ స్థాయిల సమీపంలో ట్రేడవుతోంది. కానీ నిఫ్టీ ఈ ఏడాది అందుకున్న ఆల్‌ టైం గరిష్ఠం నుంచి 9 శాతం పడిపోవడం గమనార్హం. దీంతో నిఫ్టీ స్టాకులు కూడా వాటి గరిష్ఠ స్థాయిల నుంచి వివిధ నిష్పత్తులలో దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ పరిస్థితిని ఇన్వెస్టర్లు బ్లూచిప్‌ స్టాక్స్‌ను కూడబెట్టుకోడానికి ఉపయోగించుకోవాలని విశ్లేషకులు తెలిపారు.

   ‘ఆర్థిక సంవత్సరం మొదటిత్రైమాసికంలో మంచి ప్రదర్శణ చేసిన టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి స్టాకులను కూడా ఇన్వెస్టర్లు పరిశీలించాలని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్ అండ్‌ సెక్యూరిటీస్, సినియర్‌ విశ్లేషకుడు అతిష్ మాట్లవాలా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, సిమెన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, లార్సెన్ అండ్‌ టూబ్రో వంటి స్టాక్స్‌ను వేర్వేరు ధరల స్థాయిలలో ఎంచుకోవాలని సలహా ఇచ్చారు.You may be interested

రెండోరోజూ కొనసాగిన నష్టాలు

Thursday 29th August 2019

383 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ 10950 దిగువన ముగిసిన నిఫ్టీ  ఆర్థిక మందగమన, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్‌ పతనం రెండోరోజూ కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 383 పాయింట్ల నష్టంతో 37,068.93 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లను కోల్పోయి 10,948 వద్ద స్థిరపడింది. నేడు ఆగస్ట్‌ ఎఫ్‌ఎండ్‌ఓ కాంటాక్టు గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను సెప్టెంబర్‌ సిరీస్‌కు రోలోవర్‌ మార్చుకోనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర

మాంద్యాన్ని మార్కెట్‌ ఎక్కువకాలం ఎదుర్కోలేదు!

Thursday 29th August 2019

ఆర్థిక మందగమ ప్రభావాన్ని దీర్ఘకాలం ఎదుర్కోనే సామర్థ్యం స్టాకుల లేదని ప్రముఖ అనలిస్టు రోనోజోయ్ మజుందార్ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ మూడురోజుల లాభాలకు బుధవారం బ్రేక్‌ పడింది. గతనెలలో దేశ ఆర్థిక కార్యకలాపాల్లో బలహీనత పెరిగిందన్న వార్తలు మార్కెట్‌ను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో ఎకానమీ, మార్కెట్లు తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... మందగించిన ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గత శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన ఉద్దీపన

Most from this category