News


వచ్చే ఆరు నెలలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ హవా: మెహతా

Wednesday 27th November 2019
Markets_main1574878224.png-29906

రానున్న 6-12 నెలల కాలంలో మార్కెట్లు ఎగువ దిశలోనే కొనసాగితే అప్పుడు అధిక శాతం స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు లార్జ్‌క్యాప్‌నకు మించి పనితీరు చూపిస్తాయని ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకుడు దీపన్‌ మెహతా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..


 
మిడ్‌క్యాప్స్‌
ఇక ముందు ఇన్వెస్టర్లు ఎంచుకున్న రంగాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి (లార్జ్‌క్యాప్‌ మినహా) స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మంచిది. మీరు ఏ రంగం పట్ల సానుకూలంగా ఉంటారో అది బ్యాంకులు లేదా ఫార్మా లేదా ఆటో.. పెద్ద కంపెనీలు భారీ రాబడులను ఇవ్వకపోవచ్చు. చిన్న, మధ్య స్థాయి కంపెనీల పీఈ రీరేటింగ్‌కు అవకాశం ఉంది. ప్రతీ రంగంలోనూ ఉత్తమ కంపెనీ కాకపోయినా, లాభాల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ తదితర సమస్యలు ఉన్నప్పటికీ.. మార్కెట్ల ర్యాలీ 6-12 నెలల పాటు ఇలాగే కొనసాగితే అప్పుడు చాలా వరకు చిన్న, మధ్య స్థాయి కంపెనీలు పెద్ద కంపెనీలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తాయి. అందుకే రానున్న​ 6-12 నెలలకు ఇది మంచి పెట్టుబడుల వ్యూహం అవుతుంది. 

 

ఫైనాన్షియల్స్‌
ఎన్‌పీఏ సమస్యలు ఎదుర్కొని నిలదొక్కుకున్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇకపై వీటి ప్రొవిజన్లు తగ్గి, లాభాలు పెరగనున్నాయి. ప్రయివేటు రంగంలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకులు ఈ కోవలోనివే. ఇక మీదట, కొత్తగా పెద్ద ఎన్‌పీఏ ఖాతా రాకపోతే, వీటి లాభాలు తిరిగి గాడిన పడతాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌పై దృష్టి సారించొచ్చు. రానున్న కాలంలో వీటి నిధుల వ్యయాలు పెరగవు కానీ, తిరిగి లాభాలు వృద్ధి బాట పడతాయి. ఒత్తిళ్ల నుంచి బయటకు వచ్చే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను కొనుగోలు చేసే తరుణం ఇదే.  

 

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో
ఇది బ్లాక్‌ బస్టర్‌ ఐపీవో అవుతుంది. కంపెనీ ట్రాక్‌ రికార్డు అద్భుతంగా ఉంది. దేశంలో క్రెడిట్‌కార్డుల వ్యాపారం ఇంకా ఎంతో విస్తరించాల్సి ఉంది. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఎంతో విలువను సృష్టించింది. ఇదొక మంచి ఐపీవో అవుతుంది. రిటైల్‌, ఇనిస్టిట్యూషన్లకు ఇది మంచి పెట్టుబడి అవకాశం అవుతుంది. లిస్టింగ్‌లోనూ కొనుగోలు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. క్రెడిట్‌కార్డు వ్యాపారం తీరు, వారు విధిస్తున్న చార్జీలను బట్టి చూస్తే ఇది కచ్చితంగా మంచి లాభదాయక వ్యాపారం కానుంది.You may be interested

చేయకూడనివన్నీ చేసింది..

Thursday 28th November 2019

కార్వీపై సెబీ చీఫ్‌ త్యాగి వ్యాఖ్యలు సంస్థపై ఈవై ఫోరెన్సిక్ ఆడిట్‌  సెబీ, ఎన్‌ఎస్‌ఈలతో బ్యాంకర్ల చర్చలు ముంబై/హైదరాబాద్‌ బిజినెస్ బ్యూరో:- క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. "ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన

ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లీ పూర్వ వైభవం!

Wednesday 27th November 2019

ఈక్విటీ మార్కెట్లు అంటేనే పడి లేచే కెరటాలు. కొంత కాలం పాటు ర్యాలీ, తర్వాత కరెక్షన్‌, మళ్లీ ర్యాలీ ఇటువంటివి సహజమే. ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడా ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం (జూలై-సెప్టెంబర్‌)లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.24,000 కోట్లుగా ఉన్నాయి. క్యూ2 సమయంలోనే మార్కెట్లో భారీగా పడిపోవడం, ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఎఫ్‌పీఐలపై

Most from this category