News


కొత్త పెట్టుబడులకు చాలా సమయం ఉంది!

Wednesday 8th January 2020
Markets_main1578478711.png-30769

పరిశీలించి అడుగెయ్యండి
సమీర్‌ అరోరా
కార్పొరేట్‌ టాక్స్‌ కోత తర్వాత మార్కెట్‌ పరిధి విస్తృతమవుతుందని ఎక్కువమంది భావించారని, కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదని హీలియోస్‌ క్యాపిటల్‌ అనలిస్టు సమీర్‌ ఆరోరా చెప్పారు. ఆ సమయంలో తాము కూడా కొన్ని స్టాకులను కొన్నామని, వాటిలో కొన్ని మంచి రాబడులు ఇచ్చాయని చెప్పారు. కానీ కొన్ని మాత్రం ఇంకా పాజిటివ్‌గా మారలేదన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా అట్టిపెట్టుకున్న స్టాకులు ఇంతవరకు మంచి ఫలితం చూపలేదన్నారు. కానీ ఇటీవల కొన్న కొన్ని మాత్రం బాగా దూసుకుపోయాయని చెప్పారు. ఈ తరుణంలో కొత్తగా వేరే షేర్లు కొనాలనుకోవడం లేదని, పోర్టుఫోలియోలో ఉన్నవాటినే మరింత కొంటానని చెప్పారు. అయితే అంతకన్నా ముందు తమ వద్ద ఉన్న షార్ట్స్‌ను కవర్‌ చేయాల్సిఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు చాలా సమయం దొరికిందన్నారు. అంతకుముంధు బడ్జెట్‌ అతిపెద్ద నెగిటివ్‌ ఈవెంట్‌గా ఉంటుందని, దాని తర్వాత కొనుగోళ్లు జరుపుదామని తాను భావించానని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొత్త కొనుగోళ్లకు ఇంకా చాలా సమయం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. స్వల్పకాలానికి పలు నెగిటివ్‌ అంశాలపై స్పష్టత రావాల్సిఉందని చెప్పారు. టెలికం బకాయిలు, మందగమనం, ఇరాన్‌ సంక్షోభం, పన్ను కోతలు, విత్తలోటు, బడ్జెట్‌, సామాజిక ఆందోళనలు, ఫండింగ్‌ సమస్యలు.. ఇలా అనేక సవాళ్లు మార్కెట్‌ ముందున్నాయన్నారు. ఇవన్నీ మనకు సరైన అధ్యయనం జరిపే సమయాన్నిస్తాయని తెలిపారు. 
ఇరాన్‌ సంక్షోభం కన్నా మార్కెట్లో అంతర్లీనంగా జరుగుతున్న సంక్షోభమే పెద్దదని సమీర్‌ చెప్పారు. ఉదాహరణకు మార్కెట్లో కేవలం 20 శాతం కంపెనీలే మంచి ప్రదర్శన చూపుతున్నాయన్నారు. పాజిటివ్‌గా ఉన్న ఈ 20 శాతం కంపెనీలు కూడా ఓవర్‌వాల్యూడ్‌గా మారుతున్నాయన్నారు. అందువల్ల ఈ తరుణంలో ఒక ఇన్వెస్టరుగా కొత్త కొనుగోళ్లు చేయనని తెలిపారు. తమ పోర్టుఫోలియోలో ఫైనాన్షియల్స్‌ వాటా 80 శాతమని తెలిపారు. మార్కెట్లు ఎల్లప్పుడూ నెగిటివ్‌గా ఉంటాయని తాను చెప్పడం లేదని, మార్కెట్‌ అంటేనే పతనం తర్వాత పరుగు అని చెప్పారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి ఉంటే టెలికం, బడ్జెట్‌ తదితర అంశాల ప్రభావాన్ని అధ్యయనం చేసి పోర్టుఫోలియో పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవడం వంటివి చేపట్టవచ్చన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది నిరంతర ప్రక్రియని గుర్తు చేశారు. You may be interested

కనిష్టం నుంచి 2శాతం కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th January 2020

ఇరాన్‌ అమెరికా ఉద్రిక్తతలతో ఇంట్రాడేలో దాదాపు 1.50శాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికి నష్టాలను పూడ్చుకుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,995.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒకదశలో 500 పాయింట్లు(1.60శాతం) నష్టపోయి 30899.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌

Wednesday 8th January 2020

కాకతీయ 20 శాతం హైజంప్‌ ఓరియంట్‌ సిమెంట్‌ 7 శాతం ప్లస్‌ గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 లక్షల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి బూస్ట్‌ నివ్వనున్న ప్రణాళికలు ప్రకటించాక ఇటీవల జోరం‍దుకున్న సిమెంట్‌ రంగ కౌంటర్లు మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సాధారణ బడ్జెట్‌లో గృహ, నిర్మాణ రంగాలకు మేలు చేయగల ప్రతిపాదనలుండవచ్చన్న అంచనాలు సిమెంట్‌ రంగానికి జోష్‌నిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు

Most from this category