News


పీఈ సంస్థల్లేని ఐపీవోలు అదుర్స్‌!

Wednesday 13th November 2019
Markets_main1573583520.png-29537

ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? లిస్టింగ్‌ లాభాలను ఆర్జిస్తున్నారా..?.. అవును అంటే మీరు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. ప్రైవేటు ఈక్విటీ సంస్థల మద్దతుతో వచ్చే ఐపీవోలతో పోలిస్తే పీఈ మద్దతులేని ఐపీవోలు లిస్టింగ్‌ రోజున అధిక లాభాలను ఇస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కంపెనీల ఫండమెంటల్స్‌ కూడా ఇక్కడ పనిచేయడం లేదు!

 

2018-19, అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో గణాంకాలను పరిశీలించినట్టయితే.. పీఈ మద్దతుగల 39 కంపెనీలు లిస్టింగ్‌ రోజు సగటున 15 శాతం లాభాలను ఇచ్చాయి. కానీ, పీఈ మద్దతులేని 35 సంస్థల లిస్టింగ్‌ను పరిశీలించినట్టయితే, వీటి సగటు లాభాలు 17.7 శాతంగా ఉన్నాయి. 11 ప్రభుత్వరంగ సంస్థలను మినహాయించి మిగిలిన 26 నాన్‌ పీఈ కంపెనీల లిస్టింగ్‌ లాభాలను చూస్తే 23.3 శాతంగా ఉన్నట్టు కేపీఎంజీ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఇతర ఆసక్తికర అంశాలను చూసినట్టయితే.. 39 పీఈ మద్దతుగల ఐపీవో ఇష్యూల్లో 27 ఇష్యూలకు అధిక వ్యాల్యూషన్ల వద్ద ధర నిర్ణయించినట్టు తెలిసింది. ఆయా రంగాల్లోని పోటీ కంపెనీలతో పోలిస్తే వీటి ఐపీవో ధరలు అధికంగా నిర్ణయించారు. 

 

‘‘గతంలో పీఈ మద్దతుగల చాలా కంపెనీలు లిస్టింగ్‌ రోజున మంచి లాభాలను ఇవ్వడాన్ని చూశాం. వ్యాల్యూషన్లు అధికంగా ఉన్నా కానీ ఇది జరిగింది. అంటే వ్యాల్యూషన్లు కేవలం ఒక కారణమే. ఇతర కారణాలు.. మార్కెట్‌ సెంటిమెంట్‌, కంపెనీ ఫండమెంటల్స్‌, ఆ వ్యాపారం ఎంత వినూత్నమైనది, బ్రాండ్‌ విలువ, అధిక లాభాలను కంపెనీ కొనసాగించగలదా? ఇవన్నీ కూడా లిస్టింగ్‌ లాభాలను ప్రభావితం చేస్తాయి’’ అని హేమ్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఆస్థాజైన్‌ పేర్కొన్నారు. కార్లిల్‌ మద్దతుగల మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ ఐపీవో ఇష్యూ ధరకు 9 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయింది. కేదార క్యాపిటల్‌ మద్దతుగల స్పందనస్ఫూర్తి ఫైనాన్స్‌ కంపెనీ ఇష్యూ ధరకు 3.6 శాతం తక్కువకు లిస్ట్‌ అయింది. మరోవైపు ఐఆర్‌సీటీసీ ప్రభుత్వరంగ స్టాక్‌. ఇష్యూ ధరకు 101 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయింది. ఇక గత మూడేళ్లలో 11 ప్రభుత్వరంగ కంపెనీల లిస్టింగ్‌ లాభాలు సగటున మైనస్‌ 0.10 శాతంగా ఉండడం గమనార్హం. 



You may be interested

ఈ ఏడాది వృద్ధి 5 శాతమే

Wednesday 13th November 2019

రెండో క్వార్టర్‌లో 4.2 శాతానికి పడిపోవచ్చు ఆర్థిక వృద్దిపై ఎస్‌బీఐ ఎకోరాప్‌ అంచనాలు న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్‌ స్పష్టంచేసింది. వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని గతంలో వేసిన అంచనాలను సంస్థ సవరించింది. మరీ ముఖ్యంగా రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) జీడీపీ వృద్ధి 4.2 శాతానికి పడిపోవచ్చని పేర్కొనడాన్ని గమనించాలి. మొదటి

డీమోనిటైజేషన్‌ స్థాయికి క్యూ2 రుణ వృద్ధి

Tuesday 12th November 2019

దేశ ఆర్థిక వృద్ధి రికవరీకి ఇంకా చాలా సమయమే పడుతుందన్న దానికి నిదర్శంగా ఒకవైపు ఆటో అమ్మకాలు బలహీనంగా ఉండగా, మరోవైపు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణాల వృద్ధి 6 శాతానికి తగ్గి, తిరిగి డీమోనిటైజేషన్‌ కనిష్టానికి చేరింది. ఈ విషయాన్ని క్రెడిట్‌సూసే ఒక నివేదిక ద్వారా తెలియజేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణాల వృద్ధి 6 శాతంగా ఉందని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో రుణాల వృద్ధి తిరిగి గాడిన పడిందని, వార్షికంగా

Most from this category