News


మార్కెట్లు పడితే ఈక్విటీల్లోకి నిధుల వెల్లువ!

Friday 12th April 2019
Markets_main1555009691.png-25077

ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు పడితే తాము కొనుగోళ్లు జరిపే వారిలో ఉంటామని ఎన్విజన్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈవో నీలేష్‌ షా తెలిపారు. మార్కెట్లపై ఎన్నికల ఫలితాల ప్రభావం గురించి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. మార్కెట్లు మోడీ 2.0 ప్రభుత్వం వస్తుందని అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ప్రజా తీర్పును ఊహించడం చాలా కష్టమేనన్నారు. ఈ దశలో మాత్రం అంచనాలకు వ్యతిరేక ఫలితం వస్తే ఏంటన్న దానికి మార్కెట్లు ఇంకా సన్నద్ధం కాలేదన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. 

 

మూడు రకాల పరిమాణాలు...
ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి పూర్తి మెజారిటీలోకి రావడం, ప్రస్తుత ప్రభుత్వం బయటి నుంచి మద్దతుతో అధికారంలోకి రావడం, ప్రభుత్వం మారడం అనే మూడు రకాల పరిణామాల గురించి నీలేష్‌ షా వివరించారు. ‘‘మొదటి దృశ్యం ప్రకారం... ప్రస్తుత ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధిస్తే మార్కెట్లతో ఉత్సాహం నెలకొని నిఫ్టీ ప్రస్తుత స్థాయిల నుంచి మరో 5-10 శాతం పైకి పెరుగుతుంది. బయటి మద్దతుతో ఎన్‌డీయే ప్రభుత్వం ఏర్పడినా మార్కెట్లకు మంచిదే. అయితే ఏ పార్టీలు మద్దతు ఇస్తాయన్నది చూడాల్సి ఉంది. ఈ దృశ్యంలో మార్కెట్లు తటస్థంగా వ్యవహరిస్తాయి. 3-4 శాతం మార్కెట్లు పెరగొచ్చు. ఇక చివరిదైన ప్రభుత్వం మారే పరిమాణం ఎదురైతే... ఒక్కటని చెప్పలేం. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వమా లేక కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతుతో థర్డ్‌ ప్రంట్‌ ప్రభుత్వమా లేక బయటి నుంచి బీజేపీ మద్దతుతోనా అన్నది చూడాలి. ఒకవేళ మూడో తరహా పరిణామంలో మార్కెట్లు 2004 నాడు వాజ్‌పేయి ప్రభుత్వం ఓటమి తర్వాత 10 శాతం పడిపోయినట్టు తరహాలోనే పరిస్థితి ఉండొచ్చు. 

 

కొనుగోళ్లకు రెడీ...
ఎన్నికల్లో ఏ ఫలితం వచ్చిందన్న దానితో సంబంధం లేదన్నారు నీలేష్‌షా. చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే 1991 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ కాలంలో జీడీపీ 7 శాతం వృద్ధి రేటు ఉందని, గత 5, 10, 15, 20, 25 ఏళ్ల కాలాన్ని చూస్తే జీడీపీ 7 శాతానికి కొంచె అటు, ఇటు స్థాయిల్లోనే ఉన్న విషయాన్ని పేర్కొన్నారు. కనుక వృద్ధిపై ప్రభుత్వ మార్పు ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ‘‘1991 ఆర్థిక సంస్కరణల తర్వాత రెండు జాతీయ పార్టీలు సంస్కరణలకే కట్టుబడి ఉన్నాయి. థర్డ్‌ఫ్రంట్‌ ప్రభుత్వ కాలంలోనూ కలల బడ్జెట్‌లను తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1997-2000 లేదా 1996-1998 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పలు రంగాల్లోకి అనుమతించారు. కనుక ఏదైనా ఊహించని కుదుపు వస్తే కొనుగోళ్లకు మంచి అవకాశం. విదేశీ ఇన్వెస్టర్లు భారత దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెట్టుబడులు కొనసాగిస్తారు’’ అని నీలేష్‌ షా వివరించారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు డౌన్‌

Friday 12th April 2019

ఆసియా మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50  గంటలకు 30 పాయింట్ల నష్టంతో11,639 పాయింట్ల వద్ద కదులుతోంది. గత శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,669 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే గురువారం రాత్రి అమెరికా సూచీలు ఫ్లాట్‌గా ముగియగా, తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌ అరశాతం లాభంతో ట్రేడవుతుండగా,  మిగిలిన ప్రధాన

ఒక్కటవుతున్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు!

Friday 12th April 2019

గత రెండు సంవత్సరాల్లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వ్యాపారంలో చక్కని వృద్ధి నెలకొంది. మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ వ్యయాలు తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. కానీ, గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల వైఫల్య సంక్షోభం అనంతరం మార్కెట్లో నిధులకు కటకట ఏర్పడింది. నిధుల సమీకరణ వ్యయాలు ఎన్‌బీఎఫ్‌సీలకు పెరిగిపోయాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు బ్యాంకులకు అనుకూలంగా మారాయి. వీటికి తక్కువ వ్యయాలతో కూడిన డిపాజిట్లు భారీగా ఉండడమే

Most from this category