News


భారత్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసిన నోమురా

Monday 26th August 2019
Markets_main1566809004.png-28023

సెన్సెక్స్‌ ఏడాది టార్గెట్‌ 40వేలు
జపాన్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం నోమురా తాజాగా భారత రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్లో ఉత్సాహం పెంచుతాయని, అందువల్ల ఏడాది చివరకు సెన్సెక్స్‌ టార్గెట్‌ 40వేల పాయింట్లని అంచనా వేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ అస్థిరతల వేల స్థానికంగా పాజిటివ్‌ డెవలప్‌మెంట్స్‌పై నిధులను వెచ్చించాల్సిన సమయమిదని సూచించింది. ఎకానమీకి తాజాగా ప్రకటించిన ప్రోత్సాహకాలు, ప్రకటనలు మంచి ఉత్సాహమిస్తాయని అభిప్రాయపడింది. ఆర్థికసంవత్సరం ద్వితీయార్ధంలో జీడీపీ 6.6 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ వృద్ధితో తక్కువ సంబంధమున్నందున ఇండియా మార్కెట్లు రాబోయే కాలంలో మంచి పనితీరు కనబరుస్తాయని తెలిపింది.

డిసెంబర్‌ చివరకు సెన్సెక్స్‌ 40500 పాయింట్లను చేరవచ్చని మరో ప్రముఖ బ్రోకరేజ్‌ బీఎన్‌పీ పారిబా పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన చర్యలు షార్ట్‌టర్మ్‌కు మంచివని, అయితే అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు కలవరపెడుతున్నాయని తెలిపింది. ఆర్థిక మందగమనాన్ని గుర్తించినట్లు ప్రభుత్వం తన ప్రకటనతో స్పష్టం చేసిందని, ఈ క్రమంలో ప్రకటించిన చర్యలు ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తాయని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ఇప్పటివరకు ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే పేలవ ప్రదర్శన చూపుతున్న భారత సూచీలు రాబోయే వారాల్లో పుంజుకుంటాయని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. జెఫర్రీస్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది. 
స్వల్పకాలానికి నోమురా సిఫార్సులు: ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, సీసీఐ. You may be interested

కొనుగోళ్లకు ఇదే మంచి తరుణం!

Monday 26th August 2019

ఇంత నెగిటివ్‌ వాతావరణం ఎప్పుడూ చూడలేదు రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్నంత నిరాశాపూరిత వాతావరణం ఎప్పుడూ చూడలేదని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా చెప్పారు. పరిస్థితి చూస్తే చాలా అతి నిరాశ నిండినట్లు కనిపిస్తోందన్నారు. ఇలాంటి తరుణమే కొనుగోళ్లకు సరైన అవకాశమని సూచించారు. అయితే వెనువెంటనే సూచీల్లో రీబౌన్స్‌ ఉంటుందని భావించడం లేదని, క్రమానుగత మెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మంత్రి తాజా ప్రకటనతో సోమవారం సూచీలు భారీ లాభాల్లో

మిడ్‌సెషన్‌ కల్లా తిరిగి లాభాల్లోకి సూచీల్లోకి..

Monday 26th August 2019

ఆరంభలాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు సెన్సెక్స్‌ 493 పాయింట్లు లాభంతో 37194.33 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 10969.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల జరుగుతున్న వాణిజ్య యుద్ధ పరిష్కారం దిశగా త్వరలో చర్చలు జరగవచ్చనే అంశంతో తెరపైకి రావడంతో అమెరికా ఫ్యూచర్స్‌ ఒక్కసారిగా లాభాల్లోకి రావడంతో ఆసియా మార్కెట్లపై కొంతవరకు అమ్మకాల ఒత్తిడి తగ్గింది.

Most from this category