News


ఎస్‌బీఐకి ప్రాధాన్యం ఇచ్చిన నోముర

Wednesday 19th June 2019
news_main1560936989.png-26420

ప్రైవేట్‌ దిగ్గజాలైనా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కం‍టే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కి ప్రాధాన్యాన్ని ఇస్తానని జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోముర తెలిపింది. ‘ ఎస్‌బీఐ అభివృద్ధి కారకాలు, మార్జిన్‌ల పెరుగుదల, ఈక్విటీలపై లాభాలలో మెరుగుదల కనిపిస్తోంది. అంతేకాకుండా సంస్థ ఆస్థి నాణ్యత సమస్యలు కూడా తగ్గాయి’ అని​వివరించింది. దీంతో పాటు ఎస్‌బీఐ 2020-22 ఆర్థిక కాలం ఈపీఎస్‌ అంచనాలను 5 శాతం పెంచింది. ఎస్‌బీఐ షేరు టార్గెట్‌ ధరను రూ.470 గా ఉంచి కొనుగోలు రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అంతే కాకుండా 38శాతం సామర్ధ్య పెరుగుదలను అంచనా వేసింది. ఎస్‌బీఐ గత ఏడాది రూ.7,718 కోట్ల నష్టాలను ప్రకటించగా ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.838.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్యూఓక్యూ కాలంలో ఎన్‌పీఏలు 8.71 శాతం నుంచి 7.53 శాతానికి, అదేవిధంగా నికర ఎన్‌పీఏలు 3.95 నుంచి 3.01కి తగ్గాయి.
 You may be interested

టాటాపవర్‌ షేర్లను అప్‌గ్రేడ్‌ చేసిన సిటి బ్రోకరేజ్‌

Wednesday 19th June 2019

సిటి బ్రోకరేజ్‌ సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్‌ కంపెనీ షేర్ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. త్వరలోనే నాన్‌ కోర్‌ ఆస్తుల విభజన ప్రక్రియ, మరో 3- 6నెలల్లో ముంద్రా అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్ట్‌ రిసెల్యూషన్‌ ప్రారంభం కానుండటం టాటా పవర్‌ కంపెనీకి కలిసొచ్చే అంశాలని బ్రోకరేజ్‌ తెలిపింది. గతంలో తాము ఈ కంపెనీ షేర్లకు కేటాయించిన ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తుండంతో పాటు షేరు

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనేందుకిదే సమయం!

Wednesday 19th June 2019

నిపుణుల సలహా హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ షేరు మంగళ, బుధవారాల్లో దాదాపు 8 శాతం మేర పతనమైంది. మంగళవారం షేరు తొమి‍్మదినెలల్లో ఎన్నడూ లేని ఇంట్రాడే పతనాన్ని నమోదు చేసింది. ఎస్సెల్‌ గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీస్‌ను తన పథకాల్లోకి తీసుకోవాలన్న ఏఎంసీ నిర్ణయం మదుపరులకు రుచించలేదు. దీంతో కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే ఈ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయ ప్రజలు బంగారం, రియల్టీలో పొదుపు

Most from this category