మార్చినాటికి నిఫ్టీ @12,900!
By D Sayee Pramodh

నోమురా అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి నిఫ్టీ టార్గెట్ 12900 పాయింట్లని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ నోమురా ప్రకటించింది. దేశీయ మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఏడాది కాలానికి దేశీయ మార్కెట్లపై పాజిటివ్‌గా ఉన్నామని, బడ్జెట్లో ప్రకటించిన చర్యలన్నీ పెట్టుబడి సైకిల్‌ను ముందుకు నడిపేవిగా ఉన్నాయని నోమురా ఇండియా రిసెర్చ్ హెడ్ సైయోన్ ముఖర్జీ చెప్పారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, బ్యాంకింగ్ రంగంలో రుణ కేటాయింపులు తగ్గడమనేవి దేశీయ మార్కెట్‌కు ప్రధాన అవరోధాలని చెప్పారు. ఈ భయాలు దీర్ఘకాలం కొనసాగినా, అంతర్జాతీయ రిస్కుల కారణంగా చమురు ధరలు పెరిగినా తమ అంచనాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుందని వివరించారు. దేశీయ ఎకానమీలో రికవరీ బలహీనంగా ఉన్నా, క్రమానుగతంగా కనిపిస్తోందన్నారు. ఇంకో రెండు త్రైమాసికాల తర్వాత ఎకానమీలో భయాలు వెనకబడతాయన్నారు. ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రా, హెల్త్‌కేర్ రంగాలపై తాము పాజిటివ్‌గా ఉన్నామని చెప్పారు.
ఫైనాన్షియల్స్‌లో పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్ కార్పొరేట్బ్యాంకులపై ఎక్కువ బుల్లిష్‌గా ఉన్నట్లు ముఖర్జీ చెప్పారు. ఇన్ఫ్రా రంగంలో నిర్మాణ కంపెనీలు, జల ప్రాజెక్టులకు సంబంధించిన కంపెనీలు బాగుంటాయని, హెల్త్‌కేర్ రంగంపై కాంట్రా ధృక్పధం కారణంగా పాజిటివ్‌గా ఉన్నామని వివరించారు. వీటితో పాటు యుటిలిటీలు, రియల్టీ రంగాలపై కూడా దృష్టి సారించవచ్చని సూచించారు. వినిమయం, ఆటో రంగాలపై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ రంగంలో వాల్యూషన్లు చాలా ఖరీదుగా ఉన్నాయని, ఎర్నింగ్స్ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వీటిలోని కొన్ని కంపెనీల వాల్యూషన్లు ఎర్నింగ్స్ కన్నా 40, 50 రెట్లు అధికంగా ఉన్నాయన్నారు. నిఫ్టీ కంపెనీల్లో వచ్చే రెండేళ్లలో బ్యాంకింగ్, ఐటీ, చమురు రంగాల కంపెనీల ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి ఉంటుందని చెప్పారు.
You may be interested
ఫండ్ మేనేజర్లకు చిక్కిన టాప్ స్టాక్స్
Tuesday 16th July 2019మ్యూచువల్ ఫండ్స్ పథకాలు జూన్ నెలలో ప్రైవేటు బ్యాంకులు, కన్జ్యూమర్, యుటిలిటీలు, టెక్నాలజీ, ఎన్బీఎఫ్సీలు, రిటైల్, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టినట్టు ఐసీఐసీఐ డైరెక్ట్ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. అదే సమయలో ఆయిల్ అండ్ గ్యా్స్, కెమికల్స్, ఆటో, సిమెంట్ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకున్నారని తెలిపింది. ఈ నివేదికలోని మరిన్ని వివరాలు గమనిస్తే... ఫండ్స్ మేనేజర్లు కొనుగోలు చేసిన లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో... గెయిల్, క్యాడిలా, గోద్రేజ్
రెండోరోజూ లాభాల ముగింపే...
Tuesday 16th July 2019234 పాయింట్లు పెరిగి సెన్సెక్స్ రాణించిన ఫార్మా షేర్లు దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుసగా రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 39,131 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 11662 వద్ద స్థిరపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., నేడు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ అరశాతానికి పైగా