STOCKS

News


పడి లేచే కెరటాలేనా... ఇవి?

Friday 17th May 2019
Markets_main1558116279.png-25805

టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంకు, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ ఇలా కొన్ని స్టాక్స్‌ ఇటీవలి కాలంలో బాగా నష్టాలను చవిచూశాయి. అమ్మకాల ఒత్తిడికి ఇవి పడిపోయాయి. ఈ స్టాక్స్‌లో ర్యాలీ ఆగిపోవడమే కాదు... సమీప కాలంలో ఇవి రికవరీ అవుతాయా? అన్న సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ఇలా పడిపోయిన వాటిల్లో కొన్ని ఇప్పటికీ వ్యాల్యూ బై కాదని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. యస్‌ బ్యాంకు షేరు అయితే గత నెల రోజుల్లో సగానికి సగం పడిపోయింది. 2018 ఆగస్ట్‌లో యస్‌బ్యాంకు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.404 నుంచి చూస్తే 65 శాతం క్షీణించి రూ.134కు చేరింది. ఈ పతనం ఇంకా ఉంటుందా? ఆగిపోయినట్టేనా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేరు జనవరి-ఏప్రిల్‌ వరకు 54 శాతం ర్యాలీ చేయగా, గత నెల రోజుల్లో 27 శాతం పడిపోయింది. 2018 మే నెలలో గరిష్ట ధర నుంచి చూస్తే ఇప్పటికి 61 శాతం పడిపోయినట్టు. ఇక టాటా మోటార్స్‌ షేరు ధర కూడా ఈ ఏడాది ఆరంభంలో 33 శాతం పడిపోగా, ఆ తర్వాత మంచి రికవరీ అయి, మళ్లీ గత నెల రోజుల్లో 27 శాతం పడిపోయింది. సోమానీ సిరామిక్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, శారదా క్రాప్‌క్రెమ్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేరు సైతం 13-15 శాతం మధ్యలో నష్టపోయాయి. వీటి పట్ల బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలను పరిశీలిస్తే...

 

యస్‌ బ్యాంకు
మార్చి త్రైమాసికంలో అనూహ్యంగా రూ.1,506 కోట్ల నష్టాన్ని ప్రకటించిన తర్వాత బ్రోకరేజీ సంస్థలు యస్‌ బ్యాంకు షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ప్రస్తుతం 11 బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌కు ‘సెల్‌’ రేటింగ్‌ ఇచ్చి ఉన్నాయి. బై రేటింగ్స్‌ 18 నుంచి 9కు తగ్గాయి. ఈ స్టాక్‌కు గతంలో ‘అవుట్‌ ఫెర్‌ఫార్మ్‌’ రేటింగ్‌లు 12 ఉండగా, ఇప్పుడు 5కు తగ్గాయి. ‘హోల్డ్‌’ రేటింగ్‌లు మాత్రం 10 నుంచి 13కు పెరిగాయి. రిటైల్‌, డిజిటల్‌ ఫ్రాంచైజీపై దృష్టి సారించడమన్న బ్యాంకు నూతన సీఈవో రవనీత్‌ గిల్‌ విధానం సరైన దిశలోనే ఉందని, అయితే బ్యాంకు టర్న్‌ అరౌండ్‌కు సమయం పడుతుందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది.

 

టాటా మోటార్స్‌
ఈ స్టాక్‌కు ప్రస్తుతం 11 బై రేటింగ్‌లు ఉన్నాయి. గతంలో ఇవి 10 మాత్రమే. అంటే పెరిగాయి. అంతర్జాతీయంగా వాహనాల అమ్మకాలు నిదానించడం ఈ స్టాక్‌పై ప్రభావం చూపనుందన్న ఆందోళనలు ఉన్నాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రూపంలో టాటా మోటార్స్‌ పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. దీన్ని విక్రయించనుందనే వార్తలు రాగా, వాటిని కంపెనీ ఖండించింది. జేఎల్‌ఆర్‌ రూపంలో టాటా మోటార్స్‌ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, కనుక ఈ స్టాక్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎల్‌ఎస్‌ఏ సూచించింది.

 

దిలీప్‌ బిల్డ్‌కాన్‌
మార్చి క్వార్టర్‌ ఫలితాలు అంచనాల కంటే తక్కువగా ఉండడంతో కొన్ని బ్రోకరేజీలు లక్ష్యిత ధరను తగ్గించాయి. బ్యాలన్స్‌ షీటు కఠినంగా మారినందున ఈక్విటీ షేర్ల జారీ ద్వారా లేదా రహదారి ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సమీకరించాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. సమీప కాలంలో ప్రాజెక్టుల జాప్యంతో కంపెనీ పనితీరుపై ప్రభావం పడుతుందని యస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

 

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
మార్చి త్రైమాసికం ఫలితాల్లో నాలుగు రెట్ల వృద్ధి చూపించిన తర్వాత కూడా ఈ షేరు ధర పడిపోయింది. నిధుల కొరత పరిస్థితులు స్వల్ప కాలంలో విఘాతం కలిగిస్తాయని జేఎం ఫైనాన్షియల్‌ అభిప్రాయం. ఈ షేరు ఆకర్షణీయ ధరల్లో ఉందని పేర్కొంది. డెట్‌-ఈక్విటీ రేషియో కంపెనీ లక్ష్యిత 1.5 రెట్ల కంటే తక్కువగా 0.87 రెట్ల వద్దే ఉందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. సగటు రుణ వ్యయం 8 శాతం పెద్ద సమస్య కాదని, ప్రతికూల పరిస్థితుల్లోనూ బలమైన పనితీరు చూపించిన ఈ షేరు మరింత పైకి వెళ్లే సామర్థ్యం ఉందని అంచనా వేసింది.

 

సోమాని సిరామిక్స్‌
మార్జిన్లు మెరుగుపడడం, ఆకర్షణీయమైన విలువల నేపథ్యంలో రెండో అతిపెద్ద టైల్స్‌ కంపెనీ అయిన సోమాని సిరామిక్స్‌కు ఐడీబీఐ క్యాపిటల్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. 2021 సంవత్సరం ఈపీఎస్‌ రూ.22.5 ఆధారంగా ఈ స్టాక్‌కు రూ.576 విలువ కట్టింది. విలువ ఆధారిత ఉత్పత్తుల్లో వాటా పెరుగుతుండడం, బలమైన బ్రాండ్‌, సామర్థ్య విస్తరణ, సకాలంలో శానిటరీవేర్‌, ఫాసెట్స్‌లోకి ప్రవేశించడం కంపెనీకి లాభిస్తాయని అంచనా వేసింది. You may be interested

‍స్పెన్సర్స్‌ గూటికి గోద్రెజ్‌ నేచుర్స్‌ బాస్కెట్‌

Saturday 18th May 2019

న్యూఢిల్లీ: సంజీవ్‌ గోయంకా గ్రూపులో భాగమైన స్పెన్సర్స్‌ రిటైల్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్‌ గ్రోసరీ సంస్థ నేచుర్స్‌ బాస్కెట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.300 కోట్లు. ఈ కొనుగోలు ద్వారా స్పెన్సర్స్‌ రిటైల్‌ దేశవ్యాప్త కార్యకలాపాలు కలిగిన సంస్థగా మారుతుంది. ముంబై, పుణె, బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో 36 స్టోర్లతోపాటు పశ్చిమాదిన స్పెన్సర్స్‌కు నెట్‌వర్క్‌ లభిస్తుంది. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ సబ్సిడరీ గోద్రేజ్‌ నేచుర్స్‌ బాస్కెట్‌లో నూరు

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంచుకున్న స్టాక్స్‌

Friday 17th May 2019

ఏప్రిల్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అదే నెలలో విదేశీ నిధులు రావడంతో మార్కెట్లు పై స్థాయిల్లో కొనసాగేందుకు సాయపడింది. అయితే, మే నెలకు వచ్చే సరికి విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయందారులుగా మారిపోయారు. దీంతో ఈ సమయంలో మన మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇనిస్టిట్యూషన్స్‌ ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. గత నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు తగ్గినప్పటికీ... ఈఎల్‌ఎస్‌ఎస్‌ సహా ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.5,800 కోట్ల మేర

Most from this category