News


పదేళ్లుగా వేల్యూ బయింగ్‌కు చోటెక్కడ?!

Tuesday 18th February 2020
Markets_main1582015577.png-31897

గత దశాబ్ద కాలంలో ఈ ఐడియా విఫలం
మూడేళ్లుగా ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ నిల్‌
ఇటీవలే డీమార్ట్‌ షేర్లను కొనుగోలు చేశాం
- సార్తీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌

గడిచన దశాబ్ద కాలంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో వేల్యూ బయింగ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ విఫలమైందని సార్తీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ తదితర రంగాలతోపాటు.. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దామా..?

వెండి ధరలో బంగారం?
తొలి నాళ్లలో బంగారాన్ని వెండి ధరలో కొనుగోలు చేయడాన్ని వేల్యూ బయింగ్‌గా పిలిచేవారు. ప్రస్తుతం డైమండ్‌ ధరకు బంగారాన్ని సొంతం చేసుకోవడమే వేల్యూ ఇన్వెస్టింగ్‌గా కనిపిస్తోంది. మార్కెట్లో నాకు పాతికేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ మాత్రమే ఉంది. ఈ కోణం నుంచి చూస్తే గత దశాబ్ద కాలంలో దేశీ మార్కెట్లలో వేల్యూ ఇన్వెస్టింగ్‌ విఫలమైంది. అయితే దేశీ మార్కెట్‌ గురువులతోపాటు, వారెన్‌ బఫెట్‌, గ్రాహమ్‌ బెల్‌ వంటి గ్లోబల్‌ నిపుణులు సైతం వేల్యూ ఇన్వెస్టింగ్‌పై మాట్లాడుతుంటారు. గత రెండేళ్లలో చూస్తే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ద్వారా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలు తలెత్తాయి. మరోపక్క నాలుగు పెద్ద బిజినెస్‌ గ్రూప్‌లు, ప్రమోటర్లు ఇతర సమస్యలను సైతం తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిచ్చే ప్రమోటర్లు, విలువలున్న యాజమాన్యం తదితర అంశాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం‍లో ఉంది. క్యాష్‌ ఫ్లో, రిటర్న్‌ రేషియోలు, వర్కింగ్‌ కేపిటల్‌ మేనేజ్‌మెంట్‌, భవిష్యత్‌ పెట్టుబడులు వంటి అంశాలుంటే.. వేల్యుయేషన్స్‌ను పట్టించుకోకుండా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగితే.. కొన్ని స్టాక్స్‌లోకే పెట్టుబడులు ప్రవహిస్తాయి. దీంతో వీటి వేల్యుయేషన్స్‌ అధికస్థాయిలకు చేరతాయి. కొన్ని కంపెనీలు ఫైనాన్షియల్‌ బలంతో ఇవి సాధిస్తే.. మరికొన్ని సంస్థలకు నాణ్యమైన బిజినెస్ కారణంకావచ్చు.

డీమార్ట్‌..  ఓకేనా?
నిజానికి డీమార్ట్‌ షేరు రూ. 600-800 స్థాయిలో ఖరీదుగా తోచింది. నిజానికి నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ ప్రకారం ఈ స్థాయిలలో ఎక్స్‌పెన్సివ్‌గా తోచింది. అయితే ప్రస్తుత ధరలోనూ డీమార్ట్‌లో కొంతమంది క్లయింట్ల తరఫున ఇన్వెస్ట్‌ చేశాం. ఎందుకంటే.. డీమార్ట్‌, వీమార్ట్‌, ట్రెంట్‌ తదితర రిటైలింగ్‌ కంపెనీలు పటిష్ట పనితీరును చూపుతున్నాయి. అయితే డీమార్ట్‌ జీడీపీ మందగమనంలోనూ వేగవంత అమ్మకాలను సాధిస్తోంది. ఇతర సంస్థలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన చోట రెండంకెల వృద్ధిని సాధిస్తోంది. దీనికితోడు ఈ కౌంటర్‌లో లిక్విడిటీ తక్కువకావడంతో అమ్మేవాళ్లు ఆసక్తి చూపడంలేదు. వెరసి డీమార్ట్‌ ప్రీమియం ధర పలుకుతోంది. ఇక ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ఐటీసీనే తీసుకుందాం. ఈ షేరులో వేల్యూ ఇన్వెస్టింగ్‌ ఎక్కడ? రూ. 280- 260- 240 నాకైతే తెలీదు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకదని నా ఉద్ధేశ్యం. బడ్జెట్‌, జీఎస్‌టీ వంటి అంశాలు ఈ కౌంటర్‌పై ప్రభావం చూపుతుంటాయి. ఎఫ్‌ఎంసీజీ, తదితర బిజినెస్‌లను పరిగణిస్తే.. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే స్పీడ్‌ తక్కువే. సిగరెట్ల బిజినెస్‌లో లీడర్‌ అయినప్పటికీ పన్నులు, ఆరోగ్య అంశాల కారణంగా షేరపై ఒత్తిడి కొనసాగుతోంది. ఐటీసీ షేరు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా పెట్టుబడులకు ఆసక్తి అంతగా కనిపించకపోవడానికి ఇది కారణమై ఉండవచ్చు. 

ఫార్మా తీరిలా
షేర్ల ధరలను పరిగణిస్తే.. ఫార్మాను మూడు విభాగాలుగా చెప్పవచ్చు. లార్జ్‌ క్యాప్స్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ను తీసుకుంటే ఏడాది కాలంలో జోరందుకుంది. ఐదేళ్ల కాలంలో అక్కడక్కడే ఉంది. ఇక సన్‌ ఫార్మా అయితే ఐదేళ్లలో వెనకడుగు వేసింది. ఐదేళ్ల దీర్ఘకాలంలో రిటర్నులు అందించకపోగా.. బ్లూచిప్‌ ఫార్మా స్టాక్‌ ప్రతికూలంగా మారితే పరిస్థితేంటి? ఐదేళ్లలో లుపిన్‌, సిప్లా కౌంటర్ల తీరు సైతం నిరాశామయంగానే ఉంది. దాదాపు నాలుగేళ్లుగా ఫార్మా రంగం వెనకడుగులోనే ఉంది. గత రెండు నెలల్లో మాత్రం దివీస్‌, నాట్కో, టొరంట్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా పుంజుకున్నాయి. కొన్ని ఎంఎన్‌సీలు కూడా జోరు చూపుతున్నాయి. కాగా.. నేను ఆసక్తి చూపిన మ్యాక్స్‌ ఫైనాన్స్‌ సైతం​పెద్దగా లాభపడలేదు. అయితే నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఇతర బీమా రంగ కంపెనీలు మెరుగైన రిటర్నులు ఇస్తున్నాయి. వీటితోపాటు.. ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌లోనూ ఇన్వెస్ట్‌ చేశాను.You may be interested

మార్కెట్‌ ఒడిదుడుకులు పెరుగుతాయ్‌!

Tuesday 18th February 2020

గతవారం స్వల్ప హెచ్చుతగ్గులకు లోనై, స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ముగిసినప్పటికీ, కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రతరమైతే సమీప భవిష్యత్తులో మార్కెట్లు క్షీణిస్తాయని, మార్కెట్‌ విశ్లేషకులు జిమిత్‌ మోడీ వారాంతపు తన కాలమ్‌లో వ్యాఖ్యానించారు.  పార్టమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌,  ఆర్‌బీఐ ద్రవ్యవిధాన సమీక్ష తర్వాత మార్కెట్లో వచ్చిన పెనుతుఫాను తర్వాత ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొంది.  దీంతో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ధైర్యంగా కొనుగోళ్లు చేపట్టారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.59

52 వారాల కనిష్టానికి 146 షేర్లు

Tuesday 18th February 2020

మంగళవారం 52 వారాల కనిష్టానికి 146 షేర్లు పడిపోయాయి. వీటిలో 3పి ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అడ్రోయిట్‌ ఇన్‌ఫోటెక్‌, ఆగ్రో టెక్‌ఇండియా, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కిడ్‌ప్లే ఇండస్ట్రీస్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆటోమోటివ్‌ స్టాంపింగ్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అట్లాంటా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బిల్‌

Most from this category