News


పరిస్థితి బాగుంటే సర్‌ఛార్జ్‌ ఓకే

Friday 16th August 2019
Markets_main1565952690.png-27816

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చీప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసూన్‌ గాజ్రి
అంతర్జాతీయంగా, దేశియంగా స్థూల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో పాటు బలహీనమైన కార్పోరేట్‌ ఆదాయాలు, కొనసాగుతున్న ఆర్థిక మందగమనం వలన దేశియ మార్కెట్లలో భారీగా అనిశ్చితి నెలకొని ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చీప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రసూన్‌ గాజ్రి అన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మందగమనం లేకపోయి ఉంటే ఎఫ్‌పీఐ(ఫారిన్‌ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు)లపై విధించే ఎటువంటి పన్ను అయినా కూడా మార్కెట్‌ను నష్టపరిచేది కాదు’ అని బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై విధించిన సర్‌చార్జీని ఉద్దేశించి అన్నారు. మార్కెట్లో కొంత​హెచ్చుతగ్గులను చూసేవాళ్లం గానీ అది పెద్ద సమస్యగా మారేది కాదని వివరించారు. కాగా ప్రసూన్‌ గాజ్రి రూ. 1,30,000 కోట్ల పండ్స్‌ను నిర్వహిస్తుండడం గమనార్హం. ‘వినియోగం క్షీణించడం, ఆర్థిక మందగమనం వలన పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇలాంటి పరిస్థితులలో మనకొక మద్ధతు కావాలి. అది ఎక్కడి నుంచి వచ్చిన పర్వాలేదు. అందుకే ఎఫ్‌పీఐలపై సర్‌ చార్జీ మనకొక పెద్ద సమస్యగా మారింది’ అని అన్నారు. దేశియ స్థూల సూచీలు ఆర్ధిక మందగమనాన్ని తెలుపుతున్నాయని దీనికి తోడు యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ ఘర్షణలు కూడా వీటికి జోడయ్యాయని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆర్థిక సంవత్సరం 2020 జీడీపీ అంచనాలను 6.9 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. మూలధన వ్యయం పుంజుకోవడం ప్రస్తుత పరిస్థితులలో అవసరమని, ఇదే మోడీ 2.0 ప్రభుత్వం పెట్టుబడుల థీమ్‌ కావాలని చెప్పారు.
‘ఆర్థిక వ్యవస్థ పనరుజ్జీవనానికి ఆర్‌బీఐ రేట్ల కోత ముఖ్యమే. కానీ దీనితో పాటు ఇంకోకటి చేయవలసి ఉంది. అదే మూలధన వ్యయాన్ని పెంచడం’ అని గాజ్రీ అన్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ స్టాకులపై ఎటువంటి బుల్లిష్‌ను ఆయన వ్యక్తపరచలేదు. ‘ప్రస్తుతం ఉన్న ఆర్థిక వాతావరణంలో మనం ఇంకొంత కాలం వేచి ఉండాలి. ఆర్థిక మందగమనం దీర్ఘకాలం‍గా కొనసాగితే తగినంత పరిమాణం, బ్యాలెన్స్‌ షీట్‌ల నిర్వహణ సరిగ్గాలేని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లు మరింత నష్టపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఈ ఏడాది బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 12.8 శాతం, స్మాల్‌ క్యాప్‌ 14.5 శాతం దిద్దుబాటుకు గురయ్యాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3.6 శాతం పెరిగింది. అదే 2018 సంవత్సరంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 13.4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 23.5 శాతం పడిపోగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం 5.9 శాతం పెరగడం గమనార్హం.You may be interested

తగ్గిన ప్రమోటర్ల తనఖా బంధం..

Friday 16th August 2019

ఇన్వెస్టర్లను సంతోషానికి గురి చేసే సమాచారం ఏమిటంటే... బీఎస్‌ఈ 500 కంపెనీల్లో ప్రమోటర్ల తనఖా షేర్ల పరిమాణం జూన్‌ క్వార్టర్‌లో తగ్గడం. తనఖాలో ఉన్న ప్రమోటర్ల వాటాల పరిమాణం జనవరి-మార్చి క్వార్టర్‌లో 2.83 శాతంగా ఉండగా, ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 2.47 శాతానికి క్షీణించిందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ నివేదికలో వెల్లడించింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల మొత్తం వాటాల విలువ 1.73 లక్షల కోట్లు.    ప్రమోటర్లు తమ వాటాలను రుణాల కోసం

స్వల్పలాభంతో ముగింపు

Friday 16th August 2019

మార్కెట్‌ వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగించింది. బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 39 పాయింట్ల లాభంతో 37,350.33, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 11,048 వద్ద ముగిసాయి. అంతర్జాతీయ మార్కె‍ట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు నష్టంతో మొదలైంది. ఒకదశలో సెన్సెక్స్‌  335 పాయింట్లు క్షీణించి 36,974 వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల వరకు పతనమైన 10,924.30 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

Most from this category