News


హెచ్‌యూఎల్‌పై అనలిస్టులు బుల్లిష్‌!

Tuesday 15th October 2019
Markets_main1571129663.png-28896

సెప్టెంబర్‌ త్రైమాసికానికి  ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ప్రకటించిన ఫలితాలపై పలువురు అనలిస్టులు పాజిటివ్‌గా స్పందించారు. పలు బ్రోకరేజ్‌లు సంస్థ షేరు టార్గెట్‌ను, రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేశాయి. కంపెనీ వాల్యూం వృద్ధి 5-7 శాతం రేంజ్‌లో కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు షేర్‌ఖాన్‌ తెలిపింది. హెచ్‌యూఎల్‌ టార్గెట్‌ను రూ. 2250కి పెంచింది. షేరుపై బుల్లి్‌ష్‌గా ఉన్నట్లు మరో బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌రాఠీ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఏ సంస్థ హెచ్‌యూఎల్‌ షేరు టార్గెట్‌ను రూ. 2250గా నిర్ణయించింది. రేటింగ్‌ను అవుట్‌పెర్ఫామ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. మాక్క్వైరీ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌యూఎల్‌ రేటింగ్‌ను అవుట్‌పెర్ఫామ్‌కు, టార్గెట్‌ను రూ. 2383కు పెంచింది. 
డిమాండ్‌ ఇంకా పుంజుకోలేదు!
వినిమయ డిమాండ్‌లో ఇంకా ఎలాంటి రికవరీ సంకేతాలు కనిపించడం లేదని హెచ్‌యూఎల్‌ చైర్మన్‌ సంజీవ్‌ మెహతా వ్యాఖ్యానించారు. కేవలం ముడి పదార్ధాల ధరలు తగ్గడమే క్యు2లో కంపెనీ లాభార్జనకు దోహదం చేసిందని, కానీ ఇదే సమయంలో వాల్యూం వృద్ది రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని చెప్పారు. రూరల్‌ మార్కెట్లో విక్రయాల వృద్దికి గ్రామీణ ఆదాయాల్లో పెద్దగా పెరుగుదల లేకపోవడం అడ్డంకిగా మారిందన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్రమంగా ఆదాయాలు, డిమాండ్‌ పెరిగేందుకు దోహదం చేయవచ్చని అంచనా వేశారు. మార్కెట్లు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయని, డిమాండ్‌ మాత్రం ఇంకా ఊపందుకోలేదని తెలిపారు. 
గ్రామీణ మందగమనం
ప్రసుతం అర్బన్‌గ్రోత్‌తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వృద్ది సగానికి పడిపోయిందని, ఈ విషయమై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్‌ పెడుతోందని, ఇందులో భాగంగానే రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 6000 అందిస్తోందని మెహతా చెప్పారు. ప్రధాని సైతం సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై మాట్లాడుతున్నారన్నారు. రుతుపవనాలు బాగుండడం, పండుగ సీజన్‌ ఆరంభం కానుండడంతో భవిష్యత్‌పై ఆశగా ఉన్నామన్నారు. 

క్యు2 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు మంగళవారం మధ్యాహ్న ట్రేడింగ్‌లో దాదాపు 2.5 శాతం లాభపడి 2066 రూపాయల వద్ద కదలాడుతోంది.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం జంప్‌

Tuesday 15th October 2019

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 28,257.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా ఉదయం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రైవేట్‌రంగ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఒకదశలో ఇండెక్స్‌ 1.81 శాతం వరకు లాభపడి 28694.85 వద్ద

మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలు పెంచుకున్న షేర్లివే ..!

Tuesday 15th October 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ ఈక్విటీలపై విదేశీ పెట్టుబడిదారులు బేరిష్‌ ధోరణిని ప్రదర్శించారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మందగమనం ఉన్నప్పటికీ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐలు) షేర్ల కొనుగోళ్లకు చొరవ చూపారు. ఈ క్యూ2లో డీఐఐలు రూ.53,820 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, ఇదే సమయంలో ఎఫ్‌ఐఐలు రూ.22,460 కోట్లను ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై-సెప్టెంబర్ కాలంలో సిప్‌ల ద్వారా పెట్టుబడి ప్రవాహం

Most from this category