News


ఇన్ఫీ టార్గెట్‌ తగ్గింపు... ఇప్పటికైతే లేదు!

Wednesday 23rd October 2019
Markets_main1571808923.png-29077

బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు
విజిల్‌బ్లోయర్‌ దెబ్బతో ఇన్ఫోసిస్‌ షేరు భారీ నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. కంపెనీ టాప్‌మేనేజ్‌మెంట్‌పై వచ్చిన ఫిర్యాదుల పర్యవసానం ఎలా ఉంటుందోనని మదుపరులు ఆందోళన పడుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే షేరు డీరేటింగ్‌తో ఉండొచ్చని, విచారణ పూర్తయ్యేవరకు షేరుపై సందిగ్ధత కొనసాగుతుందని బ్రోకరేజ్‌లు చెబుతున్నాయి. టాప్‌మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు సంభవించినా, లేదా విక్రయ వ్యూహాలు మార్చుకున్నా కంపెనీ వృద్దిపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. అయితే కేవలం ఆరోపణల కారణంగా షేరు టార్గెట్‌ ధర తగ్గించలేమన్నాయి. కానీ ఆరోపణల ప్రభావం రాబోయే రోజుల్లో బడా డీల్స్‌ గెలుచుకోవడంపై ప్రభావం చూపవచ్చంటున్నాయి. 
ఇన్ఫీ షేరుపై బ్రోకరేజల వ్యాఖ్యానాలు...
1. క్రెడిట్‌సూసీ: అండర్‌పెర్ఫామ్‌ రేటింగ్‌, టార్గెట్‌ రూ. 720. డిప్యుటీ సీఎఫ్‌ఓ రాజీనామా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి ఆరోపణలు నిర్ధారణ అయినా, కాకున్నా కంపెనీ వృద్ధి, పనితీరుపై ప్రభావం చూపుతాయి.
2. మోర్గాన్‌స్టాన్లీ: ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 805. ఈ ఫిర్యాదు కంపెనీకి ఎదురుదెబ్బ. క్రమంగా డీరేటింగ్‌కు దారితీయవచ్చు.
3. యూబీఎస్‌: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 900. భవిష్యత్‌లో పెద్ద డీల్స్‌ కుదుర్చుకోవడంపై తాజా ఫిర్యాదులు ప్రభావం చూపవచ్చు. క్రమంగా టీసీఎస్‌తో వాల్యూషన్‌ డిస్కౌంట్‌ విస్తృతమవుతుంది. 
4. మాక్కై‍్వరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 830. ఆరోపణలపై విచారణలో ఏమితేలుతుందనేది జాగ్రత్తగా పరిశీలించాలి. టాప్‌మేనేజ్‌మెంట్‌లో మార్పులు జరిగితే నెగిటివ్‌ ప్రభావం ఉంటుంది.
5. ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 955. ఆరోపణలు సీరియస్‌వైనా, కంపెనీ వ్యాపారంపై నేరుగా ప్రభావం చూపవు. షేరులో వచ్చే ప్రతి పతనం కొనుగోలుకు అవకాశమే!
6. జెఫర్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 915. మరింత వివరణ వచ్చేవరకు సందిగ్ధత కొనసాగుతుంది. ఎబిటాలో వంద బీపీఎస్‌ తరుగుదల ఈపీఎస్‌ అంచనాలను 4.3 శాతం మేర తగ్గిస్తుంది. పీఈ డీరేటింగ్‌ జరిగితే పెద్ద రిస్కుగా చెప్పవచ్చు.


అక్టోబర్‌ సీరిస్‌ ఆప్షన్‌డేటా చూస్తే రూ.600 వద్ద పుట్స్‌, రూ.700 వద్ద కాల్స్‌ ఎక్కువగా పోగయ్యాయి. విపరీత పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ సీరిస్‌కు షేరు రూ.570- 710 రేంజ్‌లోనే కదలాడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.You may be interested

కొనసాగుతున్న బ్రెగ్జిట్‌ అనిశ్చితి : 6 డాలర్లు పెరిగిన పసిడి

Wednesday 23rd October 2019

యూరోజోన్‌లో కొనసాగున్న బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా బుధవారం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు పెరిగి 1,493.55డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌కు సంబంధించిన బిల్లుకు బ్రిటన్‌ శాసనసభ్యులు ఓటువేశారు. అయితే మూడు రోజుల్లోగా ఆమోదించాలన్న ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ టైమ్‌ టేబిల్‌ను తిరస్కరించారు. అనుకున్న గడువు అక్టోబర్‌ 31న లోగా బిట్లు ఆమోదం కాకపోతే, బ్రెగ్జిట్‌ బిల్లు రద్దు చేసుకుని,

కనిష్టస్థాయి నుంచి కోలుకున్న చమురు

Wednesday 23rd October 2019

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో బుధవారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కోతను అమలు చేస్తారనే అంచనాలుండడంతో చమురు ధరల పతనం తగ్గింది. ఉదయం 10.23 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.47 శాతం నష్టపోయి బారెల్‌ 59.42 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.77 శాతం నష్టపోయి బారెల్‌ 54.06 డాలర్ల వద్ద

Most from this category