News


బడ్జెట్‌పై ఆశలు లేవు: అడ్రియన్‌ మోవత్‌

Monday 1st July 2019
Markets_main1561976978.png-26721

‘ఆర్థిక జాగ్రత్తలు తీసుకోడానికి ప్రభుత్వానికి ఇదే మంచి సమయం. రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ద్రవ్యలోటును తగ్గించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వవచ్చు’ అని ఈఎం ఈక్వీటీ వ్యూహకర్త అడ్రియన్‌ మోవత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటలోలనే......


 ఉద్దీపనలు వుండవు..
      2019 బడ్జెట్‌పై ఎక్కువ ఆశలు లేవు. బడ్జెట్‌లో వెలువడే ఉద్దీపనలను ఏ విధంగా చూడాలని చాలా మంది అడుగుతున్నారు కానీ బడ్జెట్‌లో ఉద్దీపనలు ఉంటాయని అనుకోవడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత వెలువడనున్న బడ్జెట్‌ కావడం వలన ఆర్థిక జాగ్రత్త, ద్రవ్యలోటు కట్టడిచేయడం వంటి చర్యలు బడ్జెట్‌లో తీసుకురావచ్చు. ఫలితంగా వృద్ధిపై ఈ బడ్జెట్‌ ప్రభావం అంత సానుకూలంగా ఉండదు. దిద్దుబాటు చర్యలు ఉన్నప్పటికి రాజకీయ స్థిరత్వం నెలకొందని, వ్యాపార పెట్టుబడులు జరుగుతున్నాయని గమనించాలి. మొత్తం మీద వృద్ధికి బడ్జెట్‌ సానుకూలంగా ఉండకపోయినప్పటికి, స్థిరమైన ప్రభుత్వం సానుకూల ప్రభావం చూపనుంది. ఇంకొన్నేళ్లలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ పాలసీలను అనుసరిస్తోందో అంచనాలకు రావొచ్చు, కాబట్టి స్థిర ‍ప్రభుత్వం వృద్ధికి ఊతమిచ్చేదే. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోడానికి  ప్రభుత్వానికిదే సరియైన సమయం. రాబోయే బడ్జెట్ ఆర్థిక జాగ్రత్తలు తీసుకునేదిగా ఉండవచ్చు. ద్రవ్య లోటును తగ్గించడానికి ఈ బడ్జెట్‌ ద్వారా ప్రయత్నించవచ్చు. 

 

ఆ రెండు రంగాల సమస్యలు..
ప్రభుత్వం మౌలిక, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. కానీ గత ఐదేళ్లు ఈ ప్రభుత్వమే ఉండడం వలన మౌలికరంగంపై ఖర్చుల తీరును మార్చకపోవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీ, పీఎస్‌యూ రంగాలలోని సమస్య చాలా కాలం నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో నలుగుతోంది.  ప్రైవేటు, పాక్షిక ప్రైవేటు ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలను ప్రభుత్వ సొమ్ముతో తీర్చడం కష్టంతో కూడుకున్న పని. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం  ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. భారత ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాలా ఆర్థిక వ్యవస్థలతో  కూడుకున్నది. అందుకే పరపతి విధానం ఆర్బీఐకి మాత్రమే చెందింది కాదు ఇందులో రాష్ట్రాల ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
     ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన మౌలిక రంగం కుదేలయ్యింది. రుణాల పంపిణిపై దీని ప్రభావం అధికంగా పడింది. ఈ సమస్యను పరిష్కరించడం కూడా అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే మూలధనాన్ని తిరిగి సాధించి, ప్రజలలో ఈ సంస్థలపై నమ్మకాన్ని తిరిగి పెంచడం కష్టంతో కూడుకున్నది. అంతేకాకుండా ఈ సమయంలో ప్రభుత్వ బ్యాంకులు తగినన్ని రుణాలు ఇవ్వడంపై కాకుండా మొండిబకాయిలపై ఎక్కువగా విమర్శలను ఎదుర్కొంటున్నాయి.  ఎన్‌బీఎఫ్‌సీలు విడిచిపెట్టిన ఈ గ్యాప్‌ను అందుకునేందుకు భారత ప్రైవేటు బ్యాంకులకు లాభదాయకమైన అవకాశాలు కనిపించడం లేదు.  ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం లార్జ్‌ క్యాప్‌ సంస్థల పై కన్నా చిన్న, మధ్యతరహా కంపెనీలపై ఎక్కువగా ప్రభావం చూపింది. స్మాల్‌ క్యాప్‌లు నష్టాల్లో ఉండడానికి ప్రధాన కారణం కూడా ఇదే.   

 

రేట్ల తగ్గింపుకు ఇదే మంచి సమయం!
  ఆర్బీఐ తదుపరి రేట్ల తగ్గింపు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కరెన్సీ బలహీనంగా ఉన్నప్పుడు, చమురు ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుంది. అలాంటి సమయాలలో వడ్డి రేట్లను తగ్గించడానికి వీలుకాదు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐకి ఉన్న ఏకైక అవకాశం వడ్డిరేట్ల తగ్గింపే అయితే ఇంతకంటే మంచి సమయం దొరకదు. 
       2018సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇండియా మార్కెట్ల ప్రదర్శన మిగిలిన మార్కెట్లతో పోల్చుకుంటే బావుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మిగిలిన మార్కెట్లు రికవరి అయ్యాయి కానీ మన మార్కెట్లు కాలేదు. అయినప్పటికి ఈ ఏడాది ద్వితియార్థంలో భారతీయ మార్కెట్లు బాగా ప్రదర్శించే అవకాశం ఉంది. స్థిర ప్రభుత్వం ఏర్పడడంతో పాటు వాణిజ్య యుద్ద ప్రభావం తక్కువగా ఉండడం వలన ద్వితియార్థంలో మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంది.

 You may be interested

11850 పైన నిఫ్టీ ముగింపు

Monday 1st July 2019

కలిసొచ్చిన ప్రపంచసానుకూలతలు  రాణించిన ఫార్మా, అటో రంగ షేర్లు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 292 పాయింట్లు పెరిగి 39,686.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 76.70 పాయింట్లు పెరిగి 11850 పైన 11,865.60 వద్ద ముగిసింది. గతవారంలో అమెరికా- చైనా అధినేతల మధ్య జరిగిన సమావేశంతో వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుముఖం పట్టే దిశగా అడుగులు పడటంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో సానుకూల

రాణిస్తున్న రియల్టీ షేర్లు

Monday 1st July 2019

లాభాల మార్కెట్లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ సోమవారం 2శాతం ర్యాలీ చేసింది. బడ్జెట్‌ రియల్టీ రంగానికి అనుకూలంగా ఉండవచ్చనే ఆశావహంతో వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ రంగ షేర్లు లాభాల బాటపట్టాయి. ఈ రంగంలో ప్రధాన షేర్లైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఒబేరాయ్‌ రియల్టీ ఇండెక్స్‌ షేర్లు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.2100 కోట్ల సమీకరణ ప్రక్రియను పూర్తి

Most from this category