News


నిప్పన్‌ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌

Saturday 8th June 2019
Markets_main1559976579.png-26170

  • ఆర్‌నామ్‌లో 22.49 శాతం వాటా కోసం
  • ఒక్కో షేర్‌ కొనుగోలు ధర రూ.230
  • మొత్తం రూ.3,179 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో (ఆర్‌నామ్‌) 22.49 శాతం వాటా కోసం నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ కోసం నిప్పన్‌ కంపెనీ రూ.3,179 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 22.49 శాతం వాటాకు సమానమైన 13.82 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌కు రూ.230 ధరకు కొనుగోలు చేయనున్నది. ఆర్‌నామ్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌, నిప్పన్‌ లైఫ్‌ కంపెనీలకు చెరో 42.88 శాతం వాటా ఉంది. మిగిలింది ప్రజల వద్ద ఉంది. తన 42.88 శాతం వాటాను జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయిస్తున్నామని రిలయన్స్‌ క్యాపిటల్‌ గత నెలలో వెల్లడించింది. ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో ఒక కంపెనీ వాటాను మరో కంపెనీ కొనుగోలు చేసే పక్షంలో తప్పనిసరిగా ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన కారణంగా నిప్పన్‌ లైఫ్‌ కంపెనీ ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ పూర్తయితే, ఆర్‌నామ్‌ డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించే హక్కు నిప్పన్‌ లైఫ్‌కు దక్కుతుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఎన్‌ఏఎమ్‌ నికర లాభం 7 శాతం ఎగసి రూ.486 కోట్లకు పెరిగింది.You may be interested

ఎంబసీ గ్రూప్‌ చేతికి ​14 శాతం వాటా

Saturday 8th June 2019

ఇండియాబుల్స్‌ రియల్టీలో వాటా విక్రయం రూ.950 కోట్లకు విక్రయించిన ప్రమోటర్లు ముంబై: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో 14 శాతం వాటాను ఆ కంపెనీ ప్రమోటర్లు రూ.950 కోట్లకు విక్రయించారు. 14 శాతం వాటాకు సమానమైన 6.3 కోట్ల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఎంబసీ గ్రూప్‌నకు ఇండియా బుల్స్‌  రియల్‌ ఎస్టేట్‌ ప్రమోటర్‌ సంస్థలు విక్రయించాయని బీఎస్‌ఈ బల్క్‌డీల్‌ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ

మైండ్‌ట్రీలో మెజారిటీ వాటాకు ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ ఆఫర్‌

Saturday 8th June 2019

రూ.5,030 కోట్లు వెచ్చించే అవకాశం ఒక్కో షేర్‌ రూ.980 ధరకు కొనుగోలు  ఈ నెల 17న మొదలై 28న ముగింపు న్యూఢిల్లీ: మైండ్‌ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్‌ అండ్‌ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా మైండ్‌ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980

Most from this category