News


భారత్‌లో వ్యాపార వృద్ధిపై నిప్పన్‌ లైఫ్‌ దృష్టి

Tuesday 1st October 2019
Markets_main1569869007.png-28635

జపాన్‌కు చెందిన అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఆర్‌నామ్‌)లో నియంత్రిత వాటాతో ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. కంపెనీలో రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఉన్న వాటాలను నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌నామ్‌లో నిప్పన్‌ లైఫ్‌ వాటా 75 శాతానికి చేరింది. తన రుణ భారాన్ని తగ్గించుకునేందుకు గాను ఆర్‌నామ్‌లో తన వాటాలను రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయించి బయటకు వెళ్లిపోయింది. దీంతో కంపెనీపై నిప్పన్‌ లైఫ్‌కు పూర్తి నియంత్రణ వచ్చేసింది. దీంతో మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా భారత మ్యూచువల్‌ పండ్స్‌ పరిశ్రమతోపాటు వేగంగా వృద్ధి చెందాలన్న ప్రణాళికలతో ఉంది.

 
ఆర్‌నామ్‌ తన చేతికి వచ్చినా కానీ, ప్రస్తుత యాజమాన్యాన్నే కొనసాగించాలని నిప్పన్‌ లైఫ్‌ నిర్ణయించింది. త్వరలో కంపెనీ పేరును మార్చడంతోపాటు రీబ్రాండ్‌ చేయాలనుకుంటోంది. పర్యావరణ, సామాజిక సంబంధిత పెట్టుబడి పథకాలతోపాటు సంపన్నుల కోసం ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉత్పత్తులను తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉంది. భారత్‌లో కొన్ని ఆలోచనలను కార్యాచరణలోకి తీసుకొస్తామని నిప్పన్‌ లైఫ్‌ ఆసియా పసిఫిక్‌ హెడ్‌ మినోరు కిమురా తెలిపారు. ‘‘భారత మార్కెట్‌ ఎక్కువగా స్థానికంగానే కేంద్రకృతమై ఉంది. అయితే, పరిశ్రమ, ఆర్థిక రంగం పరిపూర్ణత సాధించే క్రమంలో వైవిధ్యం కూడా అవసరమే. భారత్‌ చాలా వేగంగా వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌. అధిక వృద్ధి, రాబడుల అవకాశాలను ఇస్తోంది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌, ఈక్విటీలకు సంబంధించిన ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌ చక్కగానే ఉంది. అంతర్జాతీయంగా మెరుగైన విధానాలను ఇక్కడ ప్రవేశపెడతాం’’ అని కిమురా తెలిపారు. కొనుగోళ్ల ద్వారానూ భారత్‌లో తన వ్యాపార అవకాశాలను పెంచుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. భారత్‌ సైతం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ విషయంలో అంతర్జాతీయ ధోరణలను అనుసరించే అవకాశం ఉందని.. ఇప్పటికైతే మార్కెట్లో అధిక రాబడులకు సంబంధించి యాక్టివ్‌ ఫండ్‌ మేనేజర్లకు ఎన్నో అవకాశాలున్నట్టు చెప్పారు.
 You may be interested

ఇప్పుడు బంధన్‌ బ్యాంకే నయం: బందోపాధ్యాయ

Tuesday 1st October 2019

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా బ్యాంకింగ్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు సూక్ష్మ రుణ సంస్థలనే సిఫారసు చేస్తానని చెప్పారు ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ గ్రూపు చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ. దురదృష్టవశాత్తూ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల రంగం నుంచి దుర్వార్తలను వినాల్సి వస్తోందన్నారు. పీఎంసీ బ్యాంకు ఉదంతాన్ని ప్రస్తావించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి ఆర్‌బీఐ తీసుకురావడం కూడా దురదృష్టకరంగా అభివర్ణించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకుతో విలీనం కోసం ప్రయత్నం

మిడ్‌క్యాప్స్‌ ప్రదర్శన ఆరంభమవుతుంది!

Monday 30th September 2019

సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా బుల్‌మార్కెట్‌ తొలిదశలో టాప్‌ క్వాలిటీ ఉన్న బ్లుచిప్‌ స్టాకులు ముందుకు కదులుతాయని, తద్వారా బుల్లిష్‌ సెంటిమెంట్‌ విస్తరించి మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ సైతం పాజిటివ్‌ వాతావరణంలోకి వస్తాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా చెప్పారు. బుల్‌మార్కెట్‌ కొంతగడిచిన తర్వాత పెద్ద స్టాకులు ఖరీదైనవిగా మారతాయని, దీంతో ఇన్వెస్టర్లు చిన్న స్టాకులపై దృష్టి పెడతారని చెప్పారు. బుల్‌మార్కెట్‌ మంచి దశకు చేరేటప్పటికి మిడ్‌క్యాప్స్‌

Most from this category