News


10,750కు దిగువన బలహీనత

Wednesday 4th September 2019
Markets_main1567620442.png-28194

నిఫ్టీ బుధవారం 10,746 స్థాయిలో మద్దతు తీసుకుని కీలకమైన 10,800 స్థాయి పైన ముగిసింది. సూచీల్లో బలహీనత పెరగకూడదంటే నిఫ్టీ 10,800కు పైన గురువారం కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే, 10,900-10,950 అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. 

 

‘‘గురువారం సెషన్‌కు 10,800 స్థాయి కీలకం. ఈ స్థాయి పైన కొనసాగడం సూచీకి కీలకం. గురువారం వీక్లీ ఆప్షన్ల కోజింగ్‌ కావడంతో సెషన్‌ ద్వితీయ భాగంలో సూచీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. 10,900-10,950 నిరోధాలుగా పనిచేస్తాయి. మద్దతు స్థాయిలు 10,800-10,710. డైలీ చార్ట్‌లను పరిశీలిస్తే.. నిఫ్టీ గత మద్దతు స్థాయిలు 10,780-10,800 వద్దే ఉంది. సూచీ ఈ శ్రేణికి పైన ఉన్నంత వరకు 10,780-11,150 శ్రేణిగా పనిచేస్తుంది’’ అని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. 

 

సూచీ ఇప్పటికీ కీలకమైన స్వల్పకాలిక సగటు చలనం కంటే దిగువనే ఉందని, ఈ ట్రెండ్‌ ఇప్పటికీ ప్రతికూలమేనని నిపుణులు చెబుతున్నారు. సూచీలు 10,756-10,637కు పైన ఉన్నంత వరకు స్టాప్‌లాప్‌తో వ్యవహరించాలని ట్రేడర్లకు సూచిస్తున్నారు. ‘‘నిఫ్టీ-50 చివరి ర్యాలీ 10,637-11,141లో 80 శాతం వరకు పడిపోయిన తర్వాత చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఆశ్చర్యకరంగా ఆగస్ట్‌ 26 నాటి కనిష్ట స్థాయి 10,750 నుంచి సూచీ తిరిగి కోలుకుంది. కనుక నిఫ్టీ 10,756కు పైన నిలదొక్కుకున్నంత వరకు బుల్స్‌ కొంచెం ఆశావహంతోనే ఉంటారు. బుల్స్‌ ఒకవేళ 11,042 ప్లైన క్లోజ్‌ అయ్యేలా వ్యవహరిస్తే సూచీకి కొంత కాలం పాటు 10,637 బోటమ్‌గా వ్యవహరిస్తుందని ట్రేడర్లు భావించొచ్చు’’ అని చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. ఒకవేళ క్లోజింగ్‌లో నిఫ్టీ 10,750కు దిగువ ట్రేడ్‌ అయితే 10,637ను దిగిపోవడం ఖాయమని, ఆ తర్వాత టార్గెట్‌ 10,550 అని చెప్పారు.

 

‘‘నిఫ్టీ డైలీ స్కేల్‌పై బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. నిఫ్టీ ఇప్పుడిక 10,800పైన స్థిరపడాల్సి ఉంటుంది. అప్పుడు 10,950-11,000 దిశగా ర్యాలీకి అవకాశం ఉంటుంది. దిగువ స్థాయిల్లో 10,750-10,700 మద్దతుగా వ్యవహరిస్తాయి’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా పేర్కొన్నారు. 



You may be interested

నేటి నుంచే జియోఫైబర్‌ సర్వీసులు ప్రారంభం

Thursday 5th September 2019

జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్‌ బాక్స్ ఉచితం..! న్యూఢిల్లీ: డీటీహెచ్‌, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌ టాప్‌ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. "జియోఫైబర్‌ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది" అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

సగం మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాలేదు...!

Wednesday 4th September 2019

యాక్టివ్‌ నిర్వహణతో కూడిన 228 ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో 45 శాతం పథకాల రాబడులు... వాటి బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే ఐదేళ్ల కాలానికి తక్కువగా ఉండడం ఇన్వెస్టర్లను హతాశులను చేసేదే. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇలా పేలవ పనితీరు చూపించిన వాటిల్లో వ్యాల్యూ ఫండ్స్‌ విభాగం అత్యంత చెత్తగా ఉంది. ఎందుకంటే వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌తో కూడిన పథకాల్లో 67 శాతం పనితీరు ఐదేళ్ల కాలానికి బెంచ్‌ మార్క్‌ సూచీ

Most from this category