News


నిఫ్టీ తిరిగి 10,800పైన నిలబడితేనే...?

Wednesday 4th September 2019
Markets_main1567537211.png-28170

ఒక్క రోజే స్టాక్‌ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. గత శుక్రవారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు జూన్‌ త్రైమాసికంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం కావడం, ఆగస్ట్‌ నెలలో వాహన అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఇన్వె‍స్టర్ల మూడ్‌ను మార్చేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) పూనకం వచ్చి,నట్టు ఒక్క రోజే రూ.2,000 కోట్ల మేర మంగళవారం అమ్మకాలు సాగించారు. దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ రూ.1,200 కోట్ల వరకు కొనుగోలు చేయడం కొంత పతనాన్ని నిలువరించగలిగింది. నిఫ్టీ ఇటీవలి కీలక మద్దతు స్థాయి అయిన 10,800ను కోల్పోయి దిగువనే ముగిసింది. మరి తదుపరి మార్కెట్ల గమనం ఎంటి..? ఇన్వెస్టర్ల ముందున్న ప్రశ్న ఇది. 

 

మంగళవారం నిఫ్టీ ఇండెక్స్‌ 50 శాతం ఫిబోనాసి 10,890, 61.8 శాతం ఫిబోనాసి 10,830 స్థాయిలను కోల్పోయింది. దీంతో ఇటీవలి పుల్‌ బ్యాక్‌ ర్యాలీ 10,637 నుంచి 11,141 వరకు అప్‌మూవ్‌లో 78.6 శాతం ఫిబోనాసి 10,740 తదుపరి మద్దతు స్థాయి అవుతుందని ఇండియా నివేష్‌ సెక్యూరిటీస్‌కు చెందిన మెహుల్‌ కొథారి తెలిపారు. ‘‘తదుపరి సెషన్లలో ఈ స్థాయి కంటే దిగువకు వెళితే సూచీ ఇటీవలి కనిష్ట స్థాయి 10,637ను కోల్పోవచ్చు. అది మార్కెట్‌కు మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతానికి అయితే ప్రతీ పెరుగుదలను తాజా విక్రయాలకు వినియోగించుకోవచ్చు. ఇక్కడి నుంచి కనిష్ట స్థాయి ఎక్కడన్నది చెప్పడం కష్టం’’ అని కొథారి పేర్కొన్నారు. 

 

ఇక ఏదైనా అర్థవంతమైన ర్యాలీ చూడాలంటే నిఫ్టీ 10,900ను మళ్లీ అధిగమించడం అవసరమని యస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఆదిత్య అగర్వాల్‌ పేర్కొన్నారు. నిఫ్టీ 10,840-10,830 మద్దతు స్థాయిలను కోల్పోయిందని, ఇటీవలి పుల్‌బ్యాక్‌లో ఇది 61.8 శాతమని షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌ రత్నపార్ఖి అన్నారు. ‘‘ఇకపై 10,745 మద్దతు స్థాయి అవుతుంది. మొత్తం మీద చూస్తే సూచీ ఆగస్ట్‌లో నమోదు చేసిన 10,637 కనిష్ట స్థాయిని పరీక్షించొచ్చు. అంతేకాదు 10,455 దిశగా సమీప కాలంలో క్షీణించే అవకాశాలు ఉన్నాయి’’ అని తర్నపార్ఖి పేర్కొన్నారు.  

 

‘‘అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉంటే బుధవారం సెషన్‌ స్థిరంగా ఆరంభం కావచ్చు. 10,845-10,960 తక్షణ నిరోధాలుగా వ్యవహరిస్తాయి. 10,780-10,695 మద్దతు స్థాయిలు. ముఖ్యంగా 10,800 స్థాయిని జాగ్రత్తగా పరిశీలించాలి. మార్కెట్లు తిరిగి మళ్లీ వెనక్కు రావాలంటే, పెద్ద ఎత్తున బలహీనతను నిరోధించాలంటే 10,800పైన క్లోజ్‌ కావడం ముఖ్యం’’ అని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ సూచించారు. You may be interested

భారీ పతనం తర్వాత కోలుకున్న రూపీ

Wednesday 4th September 2019

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం ట్రేడింగ్‌లో 21 పైసలు బలపడి 72.18 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో పాటు, దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 97 పైసలు బలహీనపడి 9 నెలల కనిష్ఠమైన 72.39 కి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2020 జూన్‌ త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ

ఆర్థిక రికవరీతో ముందు లాభపడేవి ఇవే..

Wednesday 4th September 2019

మందగమనం ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించేదే అయినా... ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోకు మంచిదేనంటున్నారు నిపుణులు. తాజా మార్కెట్ల పతనం.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు సౌకర్యవంతమైన వ్యాల్యూషన్ల వద్ద పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని అవకాశంగా సూచిస్తున్నారు. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి పడిపోయింది. అంతర్జాతీయ ఎకానమీ సైతం మాంద్యాన్ని సూచిస్తోంది. అయితే పడిపోతున్న వృద్ధికి ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలను కూడా ప్రకటించింది. దీర్ఘకాలం కోసం

Most from this category