News


నిఫ్టీకి 11,250 కీలకం.. దిగువన మరింత బలహీనత

Thursday 10th October 2019
Markets_main1570730564.png-28810

నిఫ్టీ-50 11,300 స్థాయి నుంచి గురువారం 11,200 స్థాయి దిశగా పడిపోయింది. రోజంతా ఎక్కువగా అమ్మకాలు ఒత్తిడిని సూచీలు ఎదుర్కొన్నాయి. 200 రోజుల డీఎంఏ 11,250పైన నిలదొక్కుకుంటేనే 11,333, 11400 దిశగా నిఫ్టీ పెరిగేందుకు అవకాశం ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు. నిఫ్టీకి 11,100 మద్దతు స్థాయిగా వ్యవహరిస్తుందన్నారు. బుధవారం 11,300పైన క్లోజ్‌ అయినా కానీ, కొనసాగింపుగా కొనుగోళ్ల మద్దతు తర్వాతి రోజు రాలేదన్నారు. 

 

‘‘నిఫ్టీ-50 78 పాయింట్లు నష్టపోయి 11,234.55 వద్ద క్లోజయింది. సూచీలకు కీలకమైన ఈ స్థాయిని రానున్న సెషన్లలో జాగ్రత్తగా పరిశీలించాలి. వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజున పుట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువగా 11,200 వద్ద నెలకొంది. ఇదే సూచీలను పైన క్లోజయ్యేలా చేసింది. అయితే, కీలకమైన 200డీఎంఏ 11,268కు దిగువనే సూచీ క్లోజయింది. ఈ స్థాయికి పైన క్లోజవకపోతే మరింత బలహీనత ఉంటుంది. శుక్రవారం సూచీకి 11,270, 11,345 కీలక నిరోధాలుగా పనిచేస్తాయి. 11,180-11,050 స్థాయిల్లో మద్దతు రావచ్చు’’ అని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. 



You may be interested

మిడ్‌క్యాప్‌లో వీటిపట్ల బ్రోకరేజీలు బుల్లిష్‌

Thursday 10th October 2019

సెప్టెంబర్‌ క్వార్టర్‌ టీసీఎస్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేదు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించింది. ఇక ఇన్ఫోసిస్‌ ఫలితాలు శుక్రవారం రానున్నాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించి కంపెనీల ఫలితాల్లో ఏమంత వృద్ధి ఉండకపోవచ్చనే బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే కార్పొరేట్‌ పన్న తగ్గింపు అంశం కొన్ని కంపెనీలకు సానుకూల ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నాయి. డిమాండ్‌ క్షీణిస్తూ ఉండడం కంపెనీల ఫలితాలపై ‍ప్రభావం చూపిస్తుందని, అదే సమయలో క్రితం ఏడాది సెప్టెంబర్‌

రీరేటింగ్‌ దిశగా టెల్కోలు

Thursday 10th October 2019

చార్జీల పెంపు పాజిటివ్‌ అంటున్న బ్రోకరేజ్‌లు రిలయన్స్‌ జియో తాజాగా ఐయూసీ చార్జీలను సాకుగా చూపి అవుట్‌గోయింగ్‌ చార్జీలను(ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై) వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది కంపెనీ ఆదాయం, ఎబిటాలను ప్రోత్సాహమిచ్చే పాజిటివ్‌ చర్యని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. ఇదే బాటలో ఇతర కంపెనీలు కూడా పయనిస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే 2021 ఆర్థిక సంవత్సరానికి టెల్కోల ఎబిటా దాదాపు 16- 17 శాతం మేర పెరగవచ్చని యాక్సిస్‌

Most from this category