నిఫ్టీ పుల్ బ్యాక్‌కు అవకాశం!
By Sakshi

నిఫ్టీ50 బుధవారం పూర్తిగా అస్థిరంగా చలించింది. 177 పాయింట్ల శ్రేణిలో రెండు వైపులా కదలాడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించారు. అయితే, పుల్‌బ్యాక్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టీ ఉదయం 53 పాయింట్ల లాభంతో 11,802 గరిష్ట స్థాయి వరకు పెరిగింది. ఆ తర్వాత లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. 11,625 వరకు చేరింది. చివరకు నష్టాలను పూర్తిగా కవర్ చేసుకుంది. ఏ మార్పు లేకుండా 11,691 వద్ద ముగిసింది. ఈ ప్రక్రియలో ఇండెక్స్ హయ్యర్ టాప్, లోయర్ బోటమ్ ఏర్పరించిందని అనలిస్టుల విశ్లేషణ. ‘‘క్యాండిల్స్‌లో బ్లాక్బాడీకి తోడు, మరే ఇతర ముఖ్య మార్పులేమీ చోటు చేసుకోలేదు. మార్కెట్ మరిన్ని పుల్బ్యాక్లకు ప్రయత్నిస్తుందని అంచనా వేస్తున్నాం’’ అని జెమ్‌స్టోన్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ టెక్నికల్ అనలిస్ట్ మిలాన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ సెషన్ సాంకేతికంగా నిఫ్టీకి చాలా కీలకమైనదని, 50 రోజుల సగటు చలనాన్ని ఇది కాపాడుకుందన్నారు. ‘‘50డీఎంఏ పైన నిలదొక్కుకుని క్లోజ్ అవడం అన్నది చక్కని పుల్‌బ్యాక్ ప్రయత్నాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800పైన క్లోజ్ అయితే ఇది ధ్రువీకరణ అవుతుంది’’అని చార్ట్‌వ్యూ ఇండియా టెక్నికల్ రీసెర్చ్ చీఫ్ స్ట్రాటజిస్ట్ మజర్ మహమ్మద్ పేర్కొన్నారు. 11,800పైన ముగిస్తే 11,920 టార్గెట్‌గా పేర్కొన్నారు. అధిక రిస్క్ తీసుకునే వారు షార్ట్‌కు వెళ్లకుండా, పొజిషనల్ బెట్ కింద లాంగ్‌కు వెళ్లొచ్చని, స్టాప్‌లాస్‌గా 50డీఎంఏను పెట్టుకోవాలని సూచించారు. దిగువ స్థాయిల్లో కొనుగోళ్లతో నిఫ్టీ 11,650-12,000 స్థాయిల్లో స్థిరీకరణ కొనసాగుతోందని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెడ్ సాహజ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత స్థాయిల నుంచి 11,850-11,900 దిశగా రికవరీ ఉంటుందని అంచనా. అయితే బ్రోడర్ మార్కెట్ పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. కనుక రికవరీ నిదానంగానే ఉంటుంది. ప్రైవేటు బ్యాంకింగ్, సిమెంట్ స్టాక్స్ ముందుంటాయని, మెటల్స్, ఆటో స్టాక్స్ బలహీనత చూపుతాయని అంచనా వేస్తున్నాం’’ అని అగర్వాల్ తెలిపారు.
You may be interested
ఇక కరెన్సీ వార్?
Thursday 20th June 2019చైనాతో వాణిజ్య యుద్ధం ఆరంభించి ప్రపంచ ఆర్థిక రంగాన్ని వణికిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ట్రంప్ వైఖరి చూస్తుంటే ఆయన కరెన్సీ వార్ మొదలెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం యూరోప్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ మారియో డ్రాఘి లక్ష్యంగా ట్రంప్ చేసిన ట్వీట్లను నిదర్శనంగా పేర్కొంటున్నారు. కుంగిపోతున్న యూరోప్ వృద్ధికి అడ్డుకట్ట వేసేందుకు తాను సున్నా కంటే దిగువకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమేనంటూ మారియోడ్రాఘి ప్రకటన
ఈ నెల 24న ఇండియా మార్ట్ ఐపీఓ
Wednesday 19th June 2019బిజినెస్ ఉత్పత్తులను అందించే అతిపెద్ద ఆన్‌లైన బీటూబీ సంస్థ ఇండియా మార్ట్ ఇంటర్ మెస్ జూన్ 24న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు(ఐపీఓ)కి రానుంది. ముఖవిలువ రూ.10గల 48.88 లక్షల షేర్లను ఐపీఓలో అందుబాటులో ఉంచనుంది. ఇష్యూ ధర శ్రేణి షేరు రూ.970-973గా నిర్ణయించింది. ఇష్యూ ప్రైస్‌బ్యాండ్‌లో పై అవధి రేటు రూ. 973 వద్ద రూ.475.59కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లు జూన్ 21న బిడ్లు వేసుకునే అవకాశం