STOCKS

News


అస్థిరతలను తోసిపుచ్చలేం: మనాలి భాటియా

Sunday 5th January 2020
Markets_main1578246582.png-30681

గతేడాది మార్కెట్లకు మొత్తం మీద లాభదాయకంగానే ముగిసింది. నిఫ్టీ-50 నికరంగా 1,300 పాయింట్లు లాభపడింది. ఎన్ని కరెక్షన్లు చోటు చేసుకున్నా బుల్స్‌ ఆధిపత్యం కొనసాగింది. అయితే, 2020లోనూ మార్కెట్లలో ఇదే ధోరణి కొనసాగవచ్చని, అయితే అస్థిరతలను తోసిపుచ్చలేమని రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో మార్కెట్లలో మరిన్ని గరిష్టాలను చూసే అవకాశం ఉందన్నారు. అయితే, ఆ ప్రయాణం అంత సాఫీగా ఉండకపోవచ్చన్నారు. 

 

‘‘గరిష్టాల్లో గరిష్టం, కనిష్టాల్లో కనిష్టం ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే నెలవారీ చార్ట్‌ల్లో ప్రతికూల విభేదం ఆధారంగా ప్రస్తుత స్థాయిల నుంచి కొంత వెనక్కిపోవచ్చని తెలుస్తోంది. 11,800ను కోల్పోనంత వరకు స్వల్పకాలిక ట్రెండ్‌ బుల్లిష్‌గానే ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే 11,410, ఆ తర్వాత 11,250 వరకు కరెక్షన్‌ చోటు చేసుకోవచ్చు. గత మూడేళ్లుగా చూస్తే నిఫ్టీ-50 ఎగువవైపున స్లోపింగ్‌ చానల్‌పై ట్రేడవుతోంది. కనుక ఏదైనా కరెక్షన్‌ చోటు చేసుకుంటే దాన్ని కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవచ్చు. 

 

మొత్తం​మీద ట్రెండ్‌ సానుకూలంగానే ఉంది. నిఫ్టీ-50కి ప్రస్తుత సంవత్సరంలో తదుపరి టార్గెట్‌గా 13,078ను ఫిబోనాసి స్థాయిలు సూచిస్తున్నాయి. మొత్తం మీద ధరల ప్యాటర్స్‌, స్ట్రక్చర్‌ను పరిశీలిస్తే.. మధ్య కాలానికి ఏవియేషన్‌ స్టాక్స్‌ ప్రస్తుత ధరల వద్ద మంచి కొనుగోళ్ల అవకాశాలుగా కనిపిస్తున్నాయి. వీటితోపాటు ప్రైవేటు బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు 2020లో ఆకర్షణీయంగా మారొచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు మా ప్రాధాన్య కొనుగోళ్ల స్టాక్స్‌’’ అని మనాలి భాటియా వివరించారు.  You may be interested

ఇన్వెస్టింగ్‌ విషయంలో ఈ మూడూ వద్దు

Sunday 5th January 2020

స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ అన్నది అంత ఈజీ టాస్క్‌ కాదు. తగినంత పరిజ్ఞానం, అవగాహన, ప్రణాళిక ఉంటేనే విజయం సాధ్యపడుతుంది. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల విషయంలో ఎన్నో అపోహలు వినిపిస్తుంటాయి. ఇన్వెస్టర్లు వాటిని గుడ్డిగా అనుసరిస్తుంటారు కూడా. ఇవి ఏంటి, వీటిని ఎలా అధిగమించాలన్నది ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ తెలియజేస్తున్నారిలా..    బ్లూచిప్‌ స్టాక్స్‌  ఇన్వెస్టర్లు స్టాక్‌ను కొనుగోలు చేసే ముందు మార్కెట్‌ విలువ కాకుండా షేరు ధరను చూస్తుంటారు.

వచ్చే వారంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.5వేల కోట్ల సమీకరణ

Saturday 4th January 2020

దేశీయ అతిపెద్ద తనఖా రుణదాత సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ భారీ రుణ సేకరణకు సిద్ధమైంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో ముఖ విలువ రూ.10లక్షలు కలిగిన సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూను జారీ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎక్చ్సేంజీలకు శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఇష్యూ మంగళవారం(జనవరి 07)  ప్రారంభమై అదే రోజున ముగుస్తుంది. తద్వారా మొత్తం రూ.5000 కోట్లను సమీకరించనున్నట్లు పేర్కోంది. బాండ్‌ ఇష్యూ పరిణామం రూ.3వేల కోట్లుగా, కాగా ఓవర్సబ్‌స్క్రిప్షన్‌ను

Most from this category