News


అప్‌ట్రెండ్‌ చాన్స్‌ మిగిలే ఉంది..!

Friday 21st February 2020
Markets_main1582223626.png-31969

నిఫ్టీ గురువారం 12,150 స్థాయిల్లో నిరోధాన్ని ఎదుర్కొని, చివరికి స్వల్ప నష్టంతో 12,080 వద్ద క్లోజయింది. డైలీ చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. అప్‌ట్రెండ్‌ అవకాశాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ గత రెండు సెషన్లలోనూ 50డీఎంఏ వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నది. డైలీ చార్ట్‌లో గరిష్టంలో గరిష్టం, కనిష్టాలను నమోదు చేసిందని, వీక్లీ చార్ట్‌లో ప్రోత్సాహకర సంకేతాలను ఇచ్చిందని, దీంతో ఇండెక్స్‌ ఇక ముందూ సానుకూలంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

‘‘12,150పైన క్లోజయితే ఎగువవైపునకు ర్యాలీ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సూచీ 12,246 స్థాయిల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ బలహీనత చోటు చేసుకుంటే 12,040 దిగువన క్లోజ్‌ అవొచ్చు’’ అని చార్ట్‌వ్యూ ఇండియాకు చెందిన అనలిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. నిఫ్టీ మూమెంటమ్‌ ఆసిల్లేటర్స్‌ లోయర్‌ టైమ్‌ ఫ్రేమ్‌ చార్ట్‌ల్లో సానుకూలంగా మారాయని, వీక్లీ స్టోకాస్టిక్‌ ఆసిల్లేటర్స్‌పై కొనుగోలు సంకేతం ఇచ్చినట్టు ఆయన వివరించారు. దీంతో నిఫ్టీ రానున్న రోజుల్లోనూ సానుకూలంగా ఉండొచ్చన్నారు. ఇండెక్స్‌ 100 డీఎంఏ స్థాయిల నుంచి వెనుదిరిగిందని, 50 డీఎంఏ 12,140 వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నదని ట్రేడింగ్‌బెల్స్‌ అనలిస్ట్‌ సంతోష్‌మీనా తెలిపారు. ‘‘12,140పైన బలంగా నిలదొక్కుకుంటే షార్ట్‌ కవరింగ్‌తో తదుపరి కీలక నిరోధ స్థాయిలు 12,250-12,300 వరకు వెళ్లొచ్చు. దిగువ వైపున 20డీఎంఏ 12,040 తక్షణ మద్దతుగా ఉంటుంది. దీన్ని కోల్పోతే 11,950-11,900 కీలక మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి’’అని మీనా వివరించారు.

 

‘‘నిఫ్టీ 12,030 స్థాయికిపైన ఉన్నంత వరకు సానుకూల వైఖరి కొనసాగుతుంది. 12,200, 12,300 స్థాయి వరకు సూచీ బౌన్స్‌ కావొచ్చు. దిగువ వైపున 12,030, 11,900 కీలక మద్దతు స్థాయిలు. వీక్లీ టైమ్‌ఫ్రేమ్‌ చార్ట్‌పై లాంగ్‌ లోయర్‌ షాడోతో స్మాల్‌ బాడీడ్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ప్రతీ క్షీణత కొనుగోళ్లను సూచిస్తోంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన చందన్‌ తపారియా తెలిపారు.



You may be interested

మల్టీబ్యాగర్‌ వచ్చేస్తోంది..?

Friday 21st February 2020

హెచ్‌ఢీఎఫ్‌సీ ఏఎంసీ, ఇండియా మార్ట్‌ ఇంటర్‌మెష్‌, యాఫిల్‌ ఇండియా, ఐఆర్‌సీటీసీ ఈ ఐపీవోలు గుర్తుండే ఉంటాయి.. గత ఏడాదిన్నర కాలంలో లిస్ట్‌ అయిన ఈ కంపెనీలు.. ఇష్యూ ధరతో పోలిస్తే పలు రెట్లు పెరిగి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు తినిపించాయి. ఈ బస్సులను మిస్‌ అయ్యామని బాధ పడక్కర్లేదు. మరో మల్టీబ్యాగర్‌ వచ్చేస్తోంది..! ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఐపీవోకు సెబీ ఆమోదం జారీ చేయగా.. గ్రే

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ మార్చి 2న ప్రారంభం

Thursday 20th February 2020

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 2న ప్రారంభం అవుతుంది. ఇటీవల ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి  తెలిసిందే. ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐకి 76 శాతం, కార్లే గ్రూపుకు 24 శాతం వాటా ఉంది. దేశంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అతిపెద్ద రెండో క్రెడిట్‌ కార్డు

Most from this category