News


మార్చి నెలకు నిఫ్టీ షార్ట్‌ రోలోవర్స్‌!

Thursday 27th February 2020
Markets_main1582782498.png-32132

మార్చి నిఫ్టీ ఫ్యూచర్స్‌ బుధవారం ఫిబ్రవరి నిఫ్టీ ఫ్యూచర్స్‌ కన్నా డిస్కౌంట్‌లో ట్రేడయ్యాయి. చాలా మంది ట్రేడర్లు ఫిబ్రవరి షార్ట్‌ పొజిషన్లను మార్చికి రోలోవర్‌ చేసుకోవడంతో పాటు పలు కొత్త షార్ట్స్‌ పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ మార్కెట్లన్నీ భయం నీడలో నడుస్తున్నాయి. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మార్చి నిఫ్టీ ఫ్యూచర్స్‌ 11573 పాయింట్ల వద్ద, స్పాట్‌ నిఫ్టీ 11565 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ 11570 పాయింట్ల వద్ద ఉన్నాయి. సాధారణంగా ఒక నెల ఫ్యూచర్స్‌కు దాని తర్వాతి నెల ఫ్యూచర్స్‌కు మధ్య దాదాపు 30 పాయింట్ల వ్యత్యాసం ఉంటుంది. ఒక్కోమారు ఈ వ్యత్యాసం కాస్త తగ్గినా డిస్కౌంట్‌లోకి రావడం అరుదు. తాజా పరిస్థితికి కారణం షార్ట్స్‌ పెరగడమేనని నిపుణుల అంచనా. మార్చిలో కొన్ని కంపెనీలు డివిడెండ్లు ఇచ్చేది ఉంది. ఈ డివిడెండ్స్‌కు సంబంధించి 16 పాయింట్లను తీసివేసి లెక్కించినా ఫిబ్రవరి ఫ్యూచర్స్‌కు మార్చి ఫ్యూచర్స్‌ కనీసం 14 పాయింట్ల ప్రీమియంలో ఉండాలని, కానీ ఇది డిస్కౌంట్‌లోకి జారడం షార్ట్‌రోలవర్లకు సంకేతమని చెప్పారు. బడ్జెట్‌ ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని బడా కంపెనీలు మార్చిలో డివిడెండ్లు ప్రకటించే అవకాశాలున్నాయి. పైగా మార్చిలో ట్రేడర్లు కొత్త షార్ట్స్‌ తీసుకోవడం ఫ్యూచర్స్‌ను డిస్కౌంట్లోకి తీసుకువచ్చిందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. కరొనా భయాలు అన్ని మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్‌పై కూడా నెగిటివ్‌ ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. మార్చి సీరిస్‌లో నిఫ్టీ 11800- 12000 పాయింట్ల వద్ద నిరోధం ఎదుర్కోవచ్చని నిపుణుల అంచనా. దిగువన 11500- 11550 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి గత ర్యాలీకి 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి. 200 రోజుల డీఎంఏ 11682 పాయింట్ల వద్ద ఉంది. 



You may be interested

11100 పాయింట్ల వరకు నిఫ్టీ పతనం!

Thursday 27th February 2020

గౌతమ్‌ షా అంచనా ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇదే ధోరణి కొనసాగితే నిఫ్టీ 11300 పాయింట్లకు అక్కడ నుంచి 11100 పాయింట్లకు దిగజారవచ్చని మార్కెట్‌ అనలిస్టు గౌతమ్‌ షా చెప్పారు. ప్రస్తుత బలహీనతకు ఆరునెలల కిందటే బీజాలు పడ్డాయన్నారు. ప్రస్తుతం చార్టులు, ఇండికేటర్లు అన్నీ నెగిటివ్‌ సంకేతాలనే ఇస్తున్నాయన్నారు. నిజానికి నిఫ్టీలో బలం లేకున్నా కొన్ని స్టాకుల మద్దతుతో 12400 పాయింట్లను తాకిందన్నారు. గతవారం ఆరంభమైన పతనం

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 27th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు హెయూఎల్‌, జీఎస్‌కే కన్జూమర్‌: గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కన్జూమర్‌కుచెందిన ఫుడ్‌ బ్రాండ్లను హెచ్‌యూఎల్‌లో  విలీనం చేసేందుకు చండీఘడ్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. తద్వారా  హెచ్‌యూఎల్‌లో 5.7 శాతం వాటాను జీఎస్‌కే కన్జూమర్‌ సొంతం చేసుకోనుంది. అపోలో టైర్స్‌: గ్లోబల్‌ కంపెనీ అయిన వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ 150 మిలియన్‌ డాలర్లను అపోలో  టైర్స్‌లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అపోలో టైర్స్‌ వెల్లడించింది. వేదాంత: బీపీసీఎల్‌లో ఉన్న ప్రభుత్వ

Most from this category