News


4000 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ముగింపు

Monday 23rd March 2020
Markets_main1584960719.png-32640

పతనంలో సరికొత్త రికార్డ్‌
1135 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
బ్యాంక్‌ నిఫ్టీ 16 శాతం పతనం
నాలుగేళ్ల కనిష్టానికి నిఫ్టీ

ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఇన్వెస్టర్లు మళ్లీ భయాందోళలకు లోనయ్యారు. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే మూకుమ్మడిగా అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో గత రెండు వారాలలో రెండోసారి ట్రేడింగ్ నిలిచిపోయింది. తదుపరి తిరిగి మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ సెన్సెక్స్‌ దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో ఇండెక్సులన్నీ కుప్పకూలాయి. వెరసి సెన్సెక్స్‌ 3935 పాయింట్లు పడిపోయి 25,981 వద్ద నిలవగా.. నిఫ్టీ 1135 పాయింట్లు కోల్పోయి 7,610 వద్ద స్థిరపడింది. నిఫ్టీ నాలుగేళ్ల కనిష్టానికి చేరగా...  సెన్సెక్స్‌ మూడేళ్ల కనిష్టం వద్ద ముగిసింది.

బేర్‌.. బేర్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంక్‌ నిఫ్టీ 16 శాతం కుప్పకూలింది.  ఈ బాటలో ఆటో, మీడియా, మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ,  ఐటీ రంగాలు 14-10 శాతం మధ్య పతనమయ్యాయి. ఫార్మా 6.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఒక్క షేరూ లాభపడకపోగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్ ఫైనాన్స్‌ 28-23 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో జీ, ఐసీఐసీఐ, మారుతీ, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ 20-17 శాతం మధ్య తిరోగమించాయి.

డెరివేటివ్స్‌లో
డెరివేటివ్స్‌లో చోళమండలం,  ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌, నిట్‌ టెక్‌, బంధన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 28-23 శాతం మధ్య బేర్‌మన్నాయి. అయితే తొలుత 20 శాతం పతనమైన ఐబీ హౌసింగ్‌  8 శాతం జంప్‌చేయడం విశేషం! బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ ఇండెక్సులు సైతం 13 శాతం చొప్పున పడిపోయాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 2037 నష్టపోగా.. 232 మాత్రమే లాభపడ్డాయి.

విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3346 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2431 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గురువారం ఎఫ్‌ఐఐలు రూ. 4623 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 4367 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

భారీ పతనం తర్వాత గమనం ఎటువైపు..?

Tuesday 24th March 2020

ఇండెక్స్‌లు 13 శాతం మేర సోమవారం పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలే భారీ నష్టాలకు దారితీశాయి. సెబీ ఎఫ్‌అండ్‌వో విభాగంలో అస్థిరతలను నియంత్రించేందుకు గత శుక్రవారం ప్రకటించిన చర్యలు కూడా ఫలితమేమీ ఇవ్వలేదు. తాజా పతనాన్ని అడ్డుకునేందుకు అవి చాలవని తేలిపోయిందని అనలిస్టులు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కేసులు మన దేశంలో తగ్గడం ఒక్కటే మన మార్కెట్ల పతనాన్ని అడ్డుకోగలదని

మార్కెట్‌ మహాపతనంలో 20శాతం ర్యాలీ చేసిన షేర్లు ఇవే..!

Monday 23rd March 2020

స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మరోసారి మహా పతనాన్ని చవిచూసింది. ఈ తరుణంలో కొన్ని షేర్లు 20శాతం వరకు లాభాల్ని ఇన్వెస్టర్లకు అందించాయి. నేటి ట్రేడింగ్‌లో మొత్తంగా 1450 షేర్లు నష్టాలను చవిచూడగా,  ఫార్మాస్యూటికల్స్‌, ఇండస్ట్రీయల్‌ రంగాలకు చెందిన  156 షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.  కరోనా వైరస్ వ్యాధిని నివారణకు ఔషధాన్ని కనుక్కోనేందుకు కేంద్రం పలు ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. దీంతో నేడు అత్యధిక లాభాలను గడించిన షేర్లలో

Most from this category