News


సెంటిమెంట్‌ మెరుగవ్వకపోతే మరో 8 శాతం పతనం!

Thursday 25th July 2019
Markets_main1564049776.png-27316

మార్కెట్‌పై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా
ఎకానమీ, మార్కెట్లలో సెంటిమెంట్‌ మెరుగుపడకుంటే సూచీలు మరో 6- 8 శాతం పతనం కావడం ఖాయమని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ సీఐఓ శైలేంద్ర కుమార్‌ అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారాలంటే ఎన్‌పీఏ కేసులు కొన్నైనా పరిష్కారం కావడం, ఆర్‌బీఐ భారీగా రేట్లను తగ్గించడం లాంటివి అవసరమన్నారు. ఎకానమీలో లిక్విడిటీ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో ప్రకటించిన చర్యలు బాగున్నాయని, వీటి ప్రభావం కనిపించడానికి మరో 4-5 నెలలు పడుతుందని చెప్పారు. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికే కమ్ముకున్న నెగిటివ్‌ సెంటిమెంట్‌ను బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు మరింత ఉధృతం చేశాయని చెప్పారు. ముఖ్యంగా రియల్టీ మార్కెట్‌ నిబంధనలు కఠినతరం చేయడం, సూపర్‌రిచ్‌పై సర్‌చార్జీలు ఎక్కువ నెగిటివ్‌ ప్రభావం చూపాయన్నారు. ఇదే విధంగా నెగిటివ్‌ భావన కొనసాగితే నిఫ్టీ, సెన్సెక్స్‌లు మరో 6- 8 శాతం వరకు పతనం కావచ్చన్నారు. ఇదే నిజమైతే నిఫ్టీ 10600 పాయింట్ల వరకు పతనం కావచ్చని అంచనా. 
రిటైల్‌ నిధుల ప్రవాహం కొనసాగడం, ఎర్నింగ్స్‌లో పునరుజ్జీవం, స్థిర ప్రభుత్వం లాంటి కారణాలు నిఫ్టీ తన 17- 21 పీఈ రేంజ్‌లో కదలాడేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత కార్పొరేట్‌ ప్రపంచం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందన్నారు. మార్కెట్‌ సైకిల్‌లో అంతర్లీనంగా క్రెడిట్‌, ఇంట్రెస్ట్‌రేట్‌, లిక్విడిటీ, అసెట్‌ప్రైస్‌, డిమాండ్‌, ద్రవ్యోల్బణం, వేజ్‌గ్రోత్‌ సైకిల్‌లాంటివి అనేకం ఉంటాయని, ఇవి ఒక్కోసారి ఒక్కోటి ప్రభావం చూపుతుంటాయని తెలిపారు. ఈ సైకిల్స్‌ డౌన్‌టర్న్‌ తీసుకున్న తర్వాత తిరిగి పుంజుకోవడానికి సమయం తీసుకుంటాయని వివరించారు. ఉదాహరణకు గతంలో ఎప్పుడైనా ఆటో సైకిల్‌ రికవరీకి 18 నెలలు పట్టిందని చెప్పారు. ఇలా ఎకానమీ సైకిల్స్‌ డౌన్‌టర్న్‌ తీసుకున్న తర్వాత రేట్‌కట్‌ భారీగా చేయడం వంటి చర్యలు వేగవంతమైన రికవరీకి మార్గం ఏర్పరుస్తాయని తెలిపారు. You may be interested

ఆరంభలాభాలు ఆవిరి

Thursday 25th July 2019

  ఆరోరోజూ ఆగని సూచీల పతనం ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో మార్కెట్‌ ఆరోరోజూ నష్టాలతో ముగిసింది.  సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయి 37831 వద్ద, నిఫ్టీ 9.50 పాయింట్లు క్షీణించి 11261 వద్ద స్థిరపడ్డాయి. నేడు జూలై డెరివేటివ్‌ సిరీస్‌ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల స్క్వేరింగ్‌అప్‌ లావాదేవీల కారణంగా స్టాక్‌ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అలాగే నేటి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశ నిర్ణయాలు కోసం మార్కెట్‌ వర్గాల ఎదురుచూపులు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌

కొన్నిషేర్ల క్షీణత శాశ్వతం!

Thursday 25th July 2019

వాల్యూ బయింగ్‌ మోజులో తప్పు చెయ్యొద్దు పెట్టుబడులకు ముందు ఫండమెంటల్స్‌ చూడాలి సీనియర్‌ అనలిస్టు సంజయ్‌ బక్షి మార్కెట్లో షేర్లు భారీగా పతనమయ్యాక వాల్యూ ఇన్వెస్టర్లు కాంట్రా పెట్టుబడులకు ముందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి వాల్యూ ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని సీనియర్‌ అనలిస్టు సంజయ్‌ బక్షి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పతనమైన పలు స్టాకుల్లో ఎక్కువ శాతం షేర్ల ధరలు కోలుకోకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా షేర్లలో ఈ దఫా వచ్చిన

Most from this category