News


డిసెంబర్‌కల్లా నిఫ్టీ టార్గెట్‌ 12,200

Saturday 21st September 2019
Markets_main1569045565.png-28467

 ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో, ఆర్థిక సంవత్సరం 2020 కి గాను ద్రవ్యలోటు 3.7 శాతానికి పెరిగే అవకాశం ఉందని యెస్‌ సెక్యురిటీస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అమర్‌ అంబానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు..
నిఫ్టీ వృద్ధి అంచానాలు పెరిగాయి..
ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి అతి పెద్ద ఉద్దీపనాన్ని అందించింది. అంతేకాకుండా మ్యాట్‌(మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ ట్యాక్స్‌)ను 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గించి ఆశ్చర్యపరిచింది. ఎన్‌ఎస్‌ఈలో నమోదైన 487 కంపెనీలు, ఈ కొత్త పన్ను విధానానికి మారారని అనుకుంటే ఈ కంపెనీల వార్షిక స్టాండ్‌ ఎలోన్‌ ఈపీఎస్‌(షేరుపై ఆదాయం)పై 7 శాతం సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పన్నులాభాలు ఆర్థిక సంవత్సరం 2020 చివరి నాటికల్లా(2020 మార్చి) అమలులోకి వస్తే, ఏడాది ప్రాతిపదికన  నిఫ్టీ వృద్ధి అంచానా, ముందు నిర్దేశించుకున్న 5 శాతం నుంచి 12 శాతం పెరుగుతుంది. 
ద్రవ్యలోటు జీడీపీలో 3.7 శాతంగా.. 
   ఆర్థిక సంవత్సరం 2020లో దేశ జీడీపీ 9.3 శాతం వృద్ది చెంది రూ. 207.8 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనాలున్నప్పటికి, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో పన్నుల సేకరణలో రూ. 1.45 ట్రిలియన్‌​తగ్గుతాయి. ఇది ద్రవ్యలోటులో 70 బేసిస్‌పాయింట్ల వరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా అధ్వాన్న పరిస్థితులలోనైనా ద్రవ్యలోటు దేశ జీడీపీలో నాలుగు శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టుకున్న ద్రవ్యలోటు లక్ష్యం 3.3 శాతం కంటే అధికం కావడం గమనార్హం. కానీ తాజాగా ఆర్‌బీఐ తన మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయడానికి అంగీకరించడంతో ద్రవ్యలోటు ఒత్తిళ్లను కొంతవరకు తగ్గవచ్చు. ఆర్‌బీఐ, ప్రభుత్వానికి అందించే సాధారణ డివిడెండ్‌కు అదనం‍గా రూ. 526 బిలియన్‌ల(జీడీపీలో 0.3 శాతం) నగదును ప్రభుత్వానికి అందిస్తుంది. పన్నుల సేకరణ తగ్గడంతో ఏర్పడే ద్రవ్యలోటు రిస్క్‌ను దీనితో ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంది. 
  వీటితోపాటు ప్రభుత్వం నిర్దేశించుకున్న పెట్టుబడి ఉపసంహరణ లక్ష్యం రూ. 1.05 ట్రిలియన్ల్‌ను ఈ ఏడాది చేరుకునే వాతవరణం కనిపిస్తోంది. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతోపాటు ప్రభుత్వం, ప్రభుత్వరంగ బ్యాంకులకు అందించిన రూ. 70,000 కోట్ల మూలధనం కూడా ద్రవ్యలోటుపై ప్రభావం చూపనుంది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2020 లో ద్రవ్యలోటు జీడీపీలో 3.7 శాతంగా ఉండవచ్చని మేము అంచనా వేస్తున్నాం. 
బాండ్‌ ఈల్డ్‌లు పెరిగే అవకాశం..
ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాండ్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు  పెరుగుతాయని అంచానా వేస్తున్నాం. మొత్తంగా ఈ ఏడాది 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 6.7-7.1 శాతం మధ్య కదలాడింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక ఉద్దీపన చర్యల వలన, ఆర్‌బీఐ మరింతగా వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలుండదు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆర్‌బీఐ 110 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేటును తగ్గించింది. ఫలితంగా ప్రస్తుతం రెపో రేటు 5-5.15 శాతం ఉంది. 
నిఫ్టీ 12,200 స్థాయికి ...
   బ్లూ చిప్‌ కౌంటర్‌లో బ్యాంకింగ్‌ షేర్లు బలంగా ఉండడంతో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నిఫ్టీ 12,200 స్థాయికి చేరుకుంటుం‍దని అంచనా వేస్తున్నాం. ఇప్పటికి కూడా వినియోగం సైక్లికల్‌ డౌన్‌ ట్రెండ్‌లో ఉంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ మందగమనం, లిక్విడిటీ సమస్యలు ఇంకా వ్యవస్థలో ఉన్నాయి. మార్కెట్‌ గత ఏడాది నుంచి కన్సోలిడేషన్‌ దశలో ఉంది. ఇది 2020లో సగం వరకు అలానే కదిలే అవకాశం ఉంది. 



You may be interested

లాభంతో ముగిసిన ఎస్ఎజీఎక్స్‌ నిఫ్టీ

Saturday 21st September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది.  ఇది 11,327.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11295.50 పాయింట్లతో పోలిస్తే 31పాయింట్ల లాభంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మందగమన భయాలతో ఇటీవల భారీ పతనాన్ని చవిచూస్తున్న మార్కెట్లో జోష్‌ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన

భెల్‌ డివిడెండ్‌ వంద శాతం

Saturday 21st September 2019

గతంలో 40 శాతం చెల్లింపు  ఏజీఎమ్‌లో 60 శాతం తుది డివిడెండ్‌ ప్రకటన  న్యూఢిల్లీ: భెల్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం వంద శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. గతంలోనే 40 శాతం డివిడెండ్‌(రూ.279 కోట్లు)ను చెల్లించిన ఈ కంపెనీ గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో 60 శాతం అదనపు తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో గత నలభై ఏళ్లుగా అప్రతిహతంగా డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లయిందని భెల్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో

Most from this category