News


ఇవి భలే లాభసాటి..!

Thursday 31st October 2019
Markets_main1572460794.png-29241

నిఫ్టీ-50 తన కీలక నిరోధ స్థాయిలు 11,700-11,800ను ఎట్టకేలకు అధిగమించి పైన క్లోజవడంతో, గత గరిష్ట స్థాయి 12,103ను పరీక్షించే దిశగా వెళుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. దీంతో ప్రధాన సూచీ కీలకమైన స్వల్ప కాల, దీర్ఘకాల సగటు చలనాలకు పైకి చేరడం బుల్లిష్‌నెస్‌కు సంకేతంగా పేర్కొంది. కొనసాగుతున్న నిర్మాణాత్మక మార్పులతో ఇండెక్స్‌ తిరిగి తన ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,100ను రానున్న నెలల్లో సవాలు చేయగలదని భావిస్తున్నట్టు ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. ఇక ఈ క్రమంలో ఇండెక్స్‌ తన కీలక మద్దతు స్థాయి 11,300ను కోల్పోకపోవచ్చని, సూచీలు తగ్గితే నాణ్యమైన స్టాక్స్‌ కొనుగోలుకు అవకాశంగా ఉపయోగించుకోవచ్చని సూచించింది. ఇన్వెస్టర్లు నాణ్యమైన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను కొనుగోలుపై దృష్టి సారించాలని పేర్కొంది. 

మంచి లాభసాటి అవకాశం ఉన్న స్టాక్స్‌ కింద.. హావెల్స్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, హాకిన్స్‌ కుకర్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ, థర్మాక్స్‌, కల్పతరు పవర్‌, విప్రో, అసెల్యా కాలే, ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మెటాలిక్స్‌, సువెన్‌ లైఫ్‌, గ్లాక్సో ఫార్మా, సాగర్‌ సిమెంట్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా, ఎంఅండ్‌ఎం, సియట్‌, ధంపూర్‌ షుగర్‌, ఇండియన్‌ హోటల్స్‌ను సూచించింది. ఇక మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న వాటి కింద.. డాబర్‌, టైటాన్‌, పిడిలైట్‌, కోటక్‌ బ్యాంకు, ఎస్‌బీఐ లైఫ్‌, టింకెన్‌, బీఈఎల్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, అబాట్‌, ఫైజర్‌, శానోఫి, ఫోనిక్స్‌ మిల్స్‌, జేకే సిమెంట్‌, హీరో మోటోకార్ప్‌, పీవీఆర్‌, కాంకర్‌, బీపీసీఎల్‌ స్టాక్స్‌ను సిఫారసు చేసింది. 



You may be interested

ఐఆర్‌సీటీసీలో ఇంకెంత సత్తా?

Thursday 31st October 2019

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సంవత్‌ 2075లో మల్టీబ్యాగర్‌ రిటర్నులు పంచింది. అక్టోబర్‌లో ఇది ఐపీవోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో షేరును రూ.320కు ఇష్యూ చేయగా, కేవలం ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలోనే 181 శాతం పెరిగింది. లిస్టింగ్‌ రోజునే రూ.728.60 వరకు వెళ్లింది. దీంతో ఐఆర్‌సీటీసీ మార్కెట్‌ విలువ రూ.15,000 కోట్ల స్థాయికి చేరిపోయింది. ఐఆర్‌సీటీసీ షేరు ఇంత అద్భుత ప్రదర్శనకు కారణం వ్యాపార

40000పైన ముగిసిన సెన్సెక్స్‌

Wednesday 30th October 2019

57 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  నాలుగోరోజూ లాభాలే రాణించిన ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఐటీ షేర్లు పన్ను తగ్గింపు అశావహ అంచనాలతో మార్కెట్‌లో మరోసారి బుల్స్‌ సందడి చేశాయి. ఫలితంగా సూచీలు వరుసగా రోజూ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 220.03పాయింట్లు లాభపడి 4నెలల అనంతరం మొదటిసారిగా 40000 మార్కుపైన 40,051 స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11850 సమీపంలో 11,844 వద్ద ముగిసింది. సూచీల్లో అధిక

Most from this category