News


రెండేళ్లలో 15వేలకు నిఫ్టీ!

Thursday 30th May 2019
Markets_main1559212307.png-26005

బ్రోకరేజ్‌ల అంచనా
లిక్విడిటీ సమస్యలకు పరిష్కారం చూడడం, ఇన్‌ఫ్రా వ్యయాలు పెంచడం, భారీగా ఉద్యోగకల్పన, సాగు సంస్కరణలు, జీఎస్‌టీ సరళీకరణ.. నూతన ప్రభుత్వం నుంచి ఆశించే కీలకాంశాలని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. అనుకున్నట్లుగా రాబోయే రోజుల్లో ఇవన్నీ నెరవేరితే బలమైన ఎర్నింగ్స్‌ గ్రోత్‌ఉంటుంది. తద్వారా భారీ ర్యాలీని ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ వర్గాలు ఆశించిన విధంగా కొత్త ప్రభుత్వ చర్యలుంటే అన్ని రకాల స్టాకుల్లో విస్తృత ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీ వచ్చే 2, 3ఏళ్లు కొనసాగుతుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ స్టీవర్ట్‌ అండ్‌ మాక్రిట్చ్‌ తెలిపింది. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలన్నీ దీర్ఘకాలిక వృద్ధికి పునాదులుగా పనిచేస్తాయని పేర్కొంది. వీటికి దన్నుగా మరికొన్ని కొత్త సంస్కరణలు వస్తే స్టాక్‌మార్కెట్ల ఉత్సాహానికి మేర ఉండదని తెలిపింది. ప్రాజెక్టుల అమలు, ఉద్యోగకల్పన, విధాన సంస్కరణలు.. దేశ వృద్ధిని, ఉత్పాదకతను పెంచుతాయని వివరించింది. ప్రస్తుతం ఎకానమీ ఒక నూతన చక్రీయ వలయానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. 
కొత్త పెట్టుబడుల సైకిల్‌ ఆరంభంతో పబ్లిక్‌ పెట్టుబడులు భారీగా పెరుగుతాయని, వచ్చే రెండేళ్ల పాటు ప్రభుత్వ వ్యయం పెరగడంతో నోట్ల రద్దు కారణంగా ఎదురైన ఇబ్బందులు పూడిపోతాయని యాక్సిస్‌ క్యాపిటల్‌ తెలిపింది. ఇదే నిజమైతే వచ్చే రెండుమూడేళ్లలో నిఫ్టీ 15000 పాయింట్లను చేరుతుందని అంచనా వేసింది. ఒకవేళ అనుకున్న సంస్కరణలు అమలు జరగకపోతే నిఫ్టీ 12400కు అటుఇటుగా తిరుగుతుంటుందని తెలిపింది. ఎన్‌డీఏ రెండోదఫాలో నిర్మాణాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని తెలిపింది. అధిక పెట్టుబడులతో వచ్చే వృద్ధి కారణంగా జీడీపీ అనూహ్యంగా దూసుకుపోతుందని, దీంతో విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉంటుందని సంస్థ తెలిపింది. దీనివల్ల మార్కెట్లు భారీ లాభాలు కళ్లచూస్తాయని అంచనా వేసింది. 2024నాటికి దేశీయ ఎకానమీ 4లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని, జాతీయ పొదుపు లక్ష కోట్ల డాలర్లను అందుకోవచ్చని తెలిపింది. 

 



You may be interested

మళ్లీ లాభాల ముగింపు

Thursday 30th May 2019

329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  మే డెరివేటివ్స్‌ కాంటాక్టులు ముగింపు కారణంగా మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో గురువారం మార్కెట్‌ భారీ లాభంతో ముగిశాయి. అలాగే నేటి రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో సెన్సెక్స్‌, నిప్టీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్ల లాభపడి 39,832 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 11,946 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలున్నప్పటికీ, నేడు మార్కెట్‌ లాభంతో ప్రారంభమైంది.

ఐటీ షేర్ల ర్యాలీ

Thursday 30th May 2019

లాభాల మార్కెట్‌లో ఐటీ షేర్లు ర్యాలీ చేశాయి. ఎన్‌ఎన్‌సీలో ఐటీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం ర్యాలీ చేసింది. పారెక్స్‌ మార్కెట్లో రూపాయి వరుసగా మూడోరోజూ బలహీనపడటం ఐటీ షేర్ల ర్యాలీకి కలిసొస్తుంది. డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు ఈ అంశం కలిసొస్తుందన్న ఐటీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా ఐటీ ఇండెక్స్‌ 1.10 శాతం ర్యాలీ చేసి 16034.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.

Most from this category