News


నిఫ్టీలో ఐరన్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 11th November 2019
Markets_main1573448618.png-29500

నిపుణుల సూచన
నిఫ్టీ పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశాలున్న ఈ సమయంలో ఐరన్‌బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం మంచిదని ఆప్షన్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయిల నుంచి 400 పాయింట్ల రేంజ్‌లో కదలాడితే ఈ వ్యూహం సత్ఫలితాలనిస్తుంది. మార్కెట్లు ర్యాలీ జరిపి అలసినందున గరిష్ఠాల వద్ద ప్రాఫిట్‌బుకింగ్‌ ఉండొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇలాంటప్పుడు ఈ బటర్‌ఫ్లై వ్యూహం మంచిదని సూచించింది. ఈ వ్యూహంలో 11900 పాయింట్ల కాల్‌ మరియు పుట్‌ను విక్రయిస్తారు. అనంతరం 12200 కాల్‌ను, 11600 పుట్‌ను కొనుగోలు చేస్తారు. కాల్‌, పుట్‌ విక్రయించడానికి ఒక్కొషేరుకు రూ. 307 అవుతుంది(ఒక లాట్‌లో 75 షేర్లుంటాయి). అలాగే కాల్‌, పుట్‌ కొనుగోలుకు షేరుకు రూ. 102 అవుతుంది.(ధరలన్నీ శుక్రవారం క్లోజింగ్‌ ఆధారంగా తీసుకున్నారు). ఈ వ్యూహంలో గరిష్ఠ లాభం షేరుకు రూ. 205(307-102) ఉంటుంది. గరిష్ఠ నష్టం రూ. 102 ఉంటుంది. రిస్క్‌ రివార్డు నిష్పత్తి 2:1గా ఉంటుంది. నిఫ్టీ 11900 పాయింట్ల వద్ద ఎక్స్‌పైరీ చెందితే వ్యూహంలో అత్యధిక లాభం వస్తుంది. ఈ వ్యూహానికి లోయర్‌ బ్రేకీవెన్‌ పాయింట్‌(ఎల్‌బీఈపీ) 11695 కాగా హయ్యర్‌ బ్రేకీవెన్‌ పాయింట్‌(హెచ్‌బీఈపీ) 12105 పాయింట్లు. ఈ రెండు స్థానాల రేంజ్‌ దాటితే నష్టం ఆరంభమవుతుంది. 

 

గమనిక: పెట్టుబడికి ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

పెరిగిన అమరరాజా నికర లాభం..షేరు 7% అప్‌

Monday 11th November 2019

అమరరాజా బ్యాటరీస్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.218.85 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికాల కంటే ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అత్యధికంగా పెరగడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్యార్టర్‌లో కంపెనీ నికర లాభం రూ. 120.23 కోట్లుగా నమోదైంది. కానీ కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి రూ. 1753.05 కోట్ల నుంచి రూ. 1695.31 కోట్లకు పడిపోయింది. కంపెనీ షేరుపై

ప్రైవేట్‌ బ్యాంక్‌లు, మెటల్స్‌కే మా ప్రాధాన్యం!

Monday 11th November 2019

‘దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ, గత వారంలో మరోసారి 12000 స్థాయి వద్ద పరీక్షను ఎదుర్కొంది. నిఫ్టీ ర్యాలీకి వివిధ రంగాలు తోడ్పాటునందినప్పటికి, బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ షేర్లు వీటి ప్రదర్శనను మరుగునపరిచాయి’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌, వీపీ రీసెర్చ్‌, అజిత్‌ మిశ్రా అన్నారు. అయినప్పటికి ఇప్పటికి కూడా విస్తృత సూచీలు ఒత్తిడిలోనే ఉన్నాయని అన్నారు. ‘మధ్యస్థ కన్సాలిడేషన్‌ జరగడంతో గత ఐదు వారాలలో నిఫ్టీ, 11,100 స్థాయి నుంచి 12,000

Most from this category