News


11250 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Friday 26th July 2019
Markets_main1564113660.png-27322

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నుడుమ శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. నిఫ్టీ ఇండెక్స్‌ తనకు సాంకేతికంగా కీలకమైన 11250 స్థాయి దిగువన 5 పాయింట్ల నష్టంతో 11,247.45 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 37820 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫోర్డ్‌ మోటర్స్‌ కంపెనీతో సహా పలు ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోవడం, యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ నిన్న జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడటం తదితర అంశాలు అంతర్జాతీయ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లతో పాటు నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇక దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీంగా నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్‌ ప్రారంభంలోనే ఫార్మా, అటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఫార్మా, అటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.16శాతంతో 29,088.90వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ట్ర్‌డింగ్‌ ప్రారంభంలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ అటో, వేదాంత, ఐఓసీ షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోగా, గ్రాసీం, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ప్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.  



You may be interested

తగ్గిన చమురు

Friday 26th July 2019

యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కారణంగా అంతర్జాతీయ మందగమనం ఇంకా కొనసాగే అవకాశం ఉందని రాయిటర్ పోల్‌ పేర్కొనడంతో చమురు ధరలు శుక్రవారం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కానీ మధ్య ప్రాచ్య ఒత్తిళ్ల వలన ఈ నష్టాలు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.15 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.1 శాతం తగ్గి బ్యారెల్‌కు 55.97 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌

ఈ దశలో షేర్లను అమ్ముకోవడం సరికాదు: శాంక్టమ్‌ వెల్త్‌

Thursday 25th July 2019

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు భయపడి షేర్లను విక్రయించినట్టయితే, మళ్లీ తిరిగి ప్రవేశించడం కష్టమవుతుందని, తదుపరి ర్యాలీని మిస్‌ కావాల్సి వస్తుందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో సునీల్‌ శర్మ అన్నారు. కరెక్షన్లు అన్నవి మార్కెట్లో సాధారణ ప్రక్రియలో భాగమేనని, ప్రతీ మూడేళ్లకోసారి 20 శాతం దిద్దుబాటు తప్పదన్నారు. ఈ మేరకు మార్కెట్‌పై ఓ వార్తా సంస్థతో అన అభిప్రాయాలను పంచుకున్నారు.    మార్కెట్లో విక్రయాలకు ఎన్నో కారణాలు దారిశీతాయని సునీల్‌ శర్మ అన్నారు.

Most from this category