మూడురోజుల లాభాలకు చెక్!
By Sakshi

ఆర్థిక మాంద్య భయాలు మార్కెట్లో లాభాల ర్యాలీకి చెక్ చెప్పాయి. బుధవారం ప్రధాన సూచీలైన సెన్సెక్స్ 189.43 పాయింట్లు పతనమైన 37,451.84 వద్ద, నిఫ్టీ 59.25 పాయింట్ల నష్టంతో 11,046.10 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడే వీలున్నట్లు పెరిగిన ఆందోళనలతో నిన్న అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అలాగే బ్రెగ్జిట్‌కు ముందు బ్రిటన్ ప్రధాని బోరీస్ పార్లమెంట్‌ను సస్పెండ్ చేయవచ్చని వార్తలతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. అలాగే ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తుండటం, రేపు ఆగస్ట్ ఎఫ్అండ్ఓ డెరివెటివ్స్ ముగింపు ఉండటం, సూచీల మూడు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణ తదితర ప్రతికూలాంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఐటీ, రియల్టీ, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, మిగలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోన్నాయి. ఎక్కువగా మెటల్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ రంగ షేర్ల క్షీణతతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.15శాతం నష్టంతో 27804 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,987.65 - 11,129.65 - రేంజ్లో, సెన్సెక్స్ 37,249.19 - 37,687.82 శ్రేణిలో కదలాడింది. కోల్ ఇండియా, వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటాస్టీల్, యస్ బ్యాంక్ షేర్లు 4శాతం నుంచి 7శాతం వరకు నష్టపోయాయి. ఐషర్‌మోటర్స్, ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు 2శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి.
You may be interested
ఈ కంపెనీల లాభాలు రెట్టింపయ్యాయి..!
Thursday 29th August 2019బీఎస్ఈ 500లో 36 కంపెనీల లాభాలు క్యూ1లో రెట్టింపయ్యాయి. దేశ ఆర్థిక రంగ వృద్ధి, కార్పొరేట్ ఆదాయాల వృద్ధి మందగమనం పరిస్థితుల్లోనూ ఇంత చక్కని పనితీరు చూపించిన ఈ కంపెనీలపై ఇన్వెస్టర్లు తప్పక దృష్టి సారించాలి. ఇలా లాభాల విషయంలో మంచి పనితీరు చూపించిన కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బోంబే బర్మా ట్రేడింగ్, చెన్నై పెట్రో, చోళమండలం ఫైనాన్షియల్, ఈక్విటాస్ హోల్డింగ్స్, గాడ్ఫ్రే ఫిలిప్స్, గుజరాత్ గ్యాస్, హ్యాట్సన్
ఈ ఏడాది చివరి నాటికి 10000 స్థాయికి నిఫ్టీ
Wednesday 28th August 2019ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ 10,000 స్థాయికి దిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిమిత్ మోదీ అంచనా వేస్తున్నారు. నిఫ్టీలో టాప్-10 ఆర్థిక రంగ షేర్లలో ఏర్పడబోయే అదనపు దిద్దుబాటు ఇందుకు కారణమవచ్చని జీమీత్ చెప్పుకొచ్చారు. ఇందుకు ఫైనాన్షియల్ రంగంలోని టాప్ 10 స్టాకులు అధిక వాల్యూషన్ల వద్ద ఉండడమే కారణం కావచ్చన్నారు. ఈ స్థాయిలో వాల్యూషన్లు పెరగడానికి ఈ ఏడాది ఫైనాన్షియల్స్ జరిపిన భారీ