News


బుల్లిష్‌ సంకేతాలు ఇస్తున్న ఎఫ్‌అండ్‌ఓ ట్రెండ్స్‌!

Saturday 8th February 2020
Markets_main1581136912.png-31622

నిఫ్టీ శుక్రవారం పరుగు కొనసాగించలేక వెనుకంజ వేసింది. రోజంతా 50 పాయింట్ల రేంజ్‌లో కదలాడి చివరకు 12100 పాయింట్ల దిగువన క్లోజయింది. వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ బుల్లిష్‌గా కనిపిస్తోంది. నిఫ్టీకి క్రమంగా మద్దతు స్థాయిలు పైవైపునకు పెరుగుతున్నాయి. నిఫ్టీ 12050 పాయింట్లను కాపాడుకున్నంత వరకు 12200- 12250 పాయింట్లను తాకేందుకే ఎక్కువ ఛాన్సులుంటాయి. ఇదే విషయాన్ని ఎఫ్‌అండ్‌ఓ గణాంకాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆప్షన్స్‌ డేటా చూస్తే నిప్టీ పుట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 12000, 11500 పాయింట్ల వద్ద అధికంగా ఉండగా, కాల్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 12500, 12400 పాయింట్ల వద్ద ఉంది. కొత్త పుట్‌ రైటింగ్‌ 11600, 11800 పాయింట్ల వద్ద, కొత్త కాల్‌ రైటింగ్‌ 12300, 12500 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. ఆప్షన్స్‌ ప్రకారం నిఫ్టీ ఫిబ్రవరి సీరిస్‌కు 11800-12300 పాయింట్ల మధ్యలోనే కదలాడే ఛాన్సులున్నాయి. ప్రస్తుతం వీఐఎక్స్‌ 13.74 వద్ద ఉంది. ఇది దిగిరావడంతో నిఫ్టీలో స్థిరత్వానికి అవకాశాలు పెరిగాయి. బ్యాంకు నిఫ్టీ చార్టుల్లో ఇన్‌సైడ్‌ బార్‌ ప్యాట్రన్‌, బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్స్‌ ఏర్పడ్డాయి. ఇది బుల్స్‌కు అనుకూలం. బ్యాంకు నిఫ్టీ మద్దతు 30800-31000 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. నిఫ్టీ షేర్లలో అరబిందో ఫార్మా, బయోకాన్‌, వోల్టాస్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, దివిస్‌ ల్యాబ్‌ కౌంటర్లలో లాంగ్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఎన్‌సీసీ, మదర్‌సన్‌సుమి, టాటామోటర్స్‌, మణుప్పురం కౌంటర్లలో షార్ట్స్‌ పెరిగాయి. 



You may be interested

అనిల్‌ అంబానీ విలువ ‘జీరో’

Saturday 8th February 2020

యూకే కోర్టుకు అనిల్‌ వివరణ ఆర్‌కామ్‌పై చైనా బ్యాంకుల కేసు నేపథ్యం ప్రభుత్వ రంగానికి చెందిన మూడు చైనా బ్యాంకులు చేసిన ఫిర్యాదులో భాగంగా యూకే కోర్టు 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 700 కోట్లు)ను డిపాజిట్‌ చేయమని అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. 70 కోట్ల డాలర్ల(రూ. 4,900 కోట్లు) రుణ చెల్లింపుల్లో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ విఫలమైన నేపథ్యంలో అనిల్‌ అంబానీపై మూడు చైనీస్‌ బ్యాంకులు లండన్‌

రూ.40,500 పైకి పుత్తడి

Saturday 8th February 2020

బంగారం ధర భారీగా పెరిగి రూ.40,500 పైకి చేరింది. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు దృష్టిపెట్టడం, అంతర్జాతీయంగా  ద్రవ్యోల్బణం  పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి దేశీయ ఎంసీఎక్స్‌లో రూ.300 పెరిగి 10 గ్రాముల బంగారం ధరం రూ. 40,644.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గతరాత్రి 4 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,574 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  (శనివారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల

Most from this category