News


5నెలల కనిష్టం వద్ద నిఫ్టీ ముగింపు

Tuesday 30th July 2019
Markets_main1564484217.png-27416

బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో షేర్ల భారీ పతనంతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ 289 పాయింట్లను కోల్పోయి 37,397 వద్దకు, నిఫ్టీ  104 పాయింట్లను నష్టపోయి 11100 దిగువున 11,085 వద్ద స్థిరపడ్డాయి. ఈ స్థాయిలు సెన్సెక్స్‌కు రెండున్నర నెలల కనిష్టస్థాయి కాగా,  నిఫ్టీ ఇండెక్స్‌కిది 5నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 5శాతం నష్టపోయింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 504 పాయింట్లు నష్టపోయి 28,791.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడే గరిష్టస్థాయి(11,267.45) నుంచి 195 పాయింట్లను కోల్పోగా, సెన్సెక్స్‌ 591 పాయింట్లను నష్టపోయింది. నిఫ్టీ 11,072.65 - 11,267.45 రేంజ్‌లో ట్రేడవ్వగా, సెన్సెక్స్‌ 37,359.03 - 37,950.21 స్థాయిలో ట్రేడైంది.  
195 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ ఇండెక్స్‌:- 
ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 49 పాయింంట్ల లాభంతో 37,735, నిఫ్టీ 25 పాయింట్ల పెరుగుదలతో 1,215 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇటీవల మార్కెట్లో జరిగిన అమ్మకాలతో షేర్లు తక్కువ ధరల వద్ద లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపారు. అలాగే ట్రేడర్లు సైతం షార్ట కవరింగ్‌కు పూనుకోవడంతో సూచీలు మిడ్‌సెషన్‌ వరకు లాభాల్లో ట్రేడయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 264 పాయింట్లు పెరిగి 37,950.21వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 11,267.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అంతాసవ్యంగా సాగుతున్న తరుణంలో మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో నెలకొన్న అనూహ్య అమ్మకాలతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పోడంతో నష్టాల్లోకి మళ్లాయి. నిఫ్టీ ఇండెక్స్‌  కీలకమైన 200డీఎంఏ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమై ఆ స్థాయికి కిందకు పతనమవడంతో అమ్మకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ బ్యాంకు షేర్లు భారీ నష్టాల్ని చవిచూసాయి. ఫలితంగా నిఫ్టీ  11100 స్థాయిని కోల్పోయింది. ఒకదశలో ఏకంగా 110 పాయింట్లు నష్టపోయి 11,078.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మరో ప్రధాన సూచీ సెన్సెక్స్‌ సైతం 333 పాయింట్లు క్షీణించి 37,363.71 వద్దకు పతనమైంది. మార్కెట్‌ చివరి వరకు అమ్మకాలు ఏదశలో తగ్గపోవడంతో సూచీలు భారీ నష్టంతో ట్రేడింగ్‌ను ముగించాల్సి వచ్చింది. 

సన్‌ఫార్మా, హీరోమోటోకార్ప్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం నుంచి 9.50శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 
 



You may be interested

దిగ్గజం అనుకుంటే.. దిగ్గున పడిపోయింది!

Tuesday 30th July 2019

భారీగా పతనమవుతున్న వొడాఫోన్‌ఐడియా షేరు ఇంకా రిస్కులున్నాయంటున్న నిపుణులు రెండేళ్ల క్రితం 2017 మార్చిలో రెండు పెద్ద టెలికం కంపెనీలు వొడాఫోన్‌, ఐడియాలు విలీన ప్రకటన చేశాయి. దేశ టెలికం రంగంలో ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ విలీనంతో ఐడియా స్టాకు భారీగా వాల్యూ పెరుగుతుందని అటు మార్కెట్‌ వర్గాలు, ఇటు ఇన్వెస్టర్లు భావించారు. విలీన సమయంలో ఒప్పందంలోని ఒక నిబంధన ప్రకారం ఐడియా సెల్యులార్‌ సంస్థ ప్రమోటర్లు విలీన సంస్థలో

ఏడాది కనిష్టానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు

Tuesday 30th July 2019

తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రంగా నమోదుకావడంతో బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏడాది కనిష్టాని పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.75.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయంలో బ్యాంకు ఈ క్యూ1 ఫలితాలను నమోదు చేసింది. ఫలితాలు మార్కెట్‌ మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో షేరు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనై 7శాతం నష్టపోయి రూ.70.30ల వద్ద ఏడాది కనిష్టానికి

Most from this category