News


రికార్డుస్థాయి నుంచి నిఫ్టీ 12,300 దిగువకు!

Monday 20th January 2020
Markets_main1579500843.png-31045

గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ
42వేల మార్కును కోల్పోయిన సెన్సెక్స్‌ 

మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 42వేల దిగువకు, నిఫ్టీ 12300 కిందకు చేరుకున్నాయి. సూచీల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ, చోటు చేసుకోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల భయాలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలో సూచీలు గరిష్టస్థాయిలకు అందుకునేందుకు దోహదపడిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్‌, పెట్రోరంగ కంపెనీలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలు సూచీలను గరిష్టస్థాయిల నుంచి వెనక్కి లాగాయి. ఫలితంగా ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెన్స్‌ నమోదు చేసిన 42,273.87 రికార్డు స్థాయి నుంచి ఏకంగా 546 పాయింట్లు నష్టపోయి 41,709 వద్దకు, నిప్టీ రికార్డు స్థాయి స్థాయి 12,430.50 నుంచి 153పాయింట్లు నష్టపోయి 12,277.20 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పతనమయ్యాయి. ఉదయం గం.11:15ని.లకు నిఫ్టీ  క్రితం ముగింపు(12,352.35)నుంచి 63.80 పాయింట్లు నష్టపోయి 12,288.55 ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు (41,945.37)తో పోలిస్తే 187పాయింట్లు క్షీణించి 41,757.81 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క రియల్టీ, ఎఫ్‌ఎంజీసీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మిగిలిని అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి. 

ఇదే సమయానికి నిప్టీ -50 ఇండెక్స్‌లో ...  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత, టీసీఎస్‌, జీ లిమిటెడ్‌, ఐఓసీ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఆర్‌ఐఎల్‌ ఈపీఎస్‌ అంచనాల కుదింపు

Monday 20th January 2020

బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్న సీఎల్‌ఎస్‌ఏ నోమురా ఇండియా టార్గెట్‌ రూ. 2020 జియోమార్ట్‌ ద్వారా కిరాణా డిజిటలైజేషన్‌?! ఈ ఏడాది మూడో త్రైమాసిక(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించాక డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌పట్ల సానుకూల ధోరణిని కొనసాగిస్తున్నట్లు పలు బ్రోకింగ్‌ సంస్థలు తెలియజేశాయి. అయితే పెట్రోకెమ్‌ బిజినెస్‌ బలహీనతల నేపథ్యంలో 2020లో ఆర్‌ఐఎల్‌ ఆర్జన 4-6 శాతంమేర నీరసించవచ్చని కొన్ని రీసెర్చ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్‌ మందగమనం, ఆరోమాటిక్‌, పాలిమర్స్‌ విభాగంలో

ఫైన్‌ ఆర్గానిక్‌ ఫైన్‌- బ్లూడార్ట్‌, లుపిన్‌ డౌన్‌

Monday 20th January 2020

ఫైన్‌ ఆర్గానిక్స్‌కు ఇక్రా అప్‌గ్రేడ్‌ బూస్ట్‌ బ్లూడార్ట్‌కు క్యూ3 ఫలితాల సెగ లుపిన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ చెక్‌ బ్లూచిప్‌ కంపెనీల అండతో తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో ’పడ్డాయి. ఉదయం 11.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 191 పాయింట్లు క్షీణించి 41,754ను తాకగా.. నిఫ్టీ 62 పాయింట్లు తిరోగమించి 12,290 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ గరిష్టంగా 42,734కు చేరగా.. నిఫ్టీ 12,430వరకూ ఎగసింది. కాగా.. విభిన్న వార్తల నేపథ్యంలో

Most from this category